దర్శకులు సహజంగా తమ సినిమాలకు సంబంధించిన వింతలు, విశేషాలను దాచి పెట్టి, తగిన సమయంలో రివీల్ చేయాలనుకుంటారు. హీరోలు, హీరోయిన్లు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని తమ వైపు నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ చిరంజీవి మాత్రం ‘ఆచార్య’ విషయంలో అస్సలు సీక్రెట్ మెయింటైన్ చేయడం లేదు. ఈ సినిమా టైటిల్‍ను కూడా చిరంజీవి చాలా సింపుల్‍గా ఏదో ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్‍లో రివీల్ చేసేసారు. తాజాగా ఆ సినిమాలోని టెంపుల్ సెట్‍ను వీడియో తీసి ఇంటర్నెట్‍లో పెట్టారు. గతంలో చిరంజీవికి సోషల్ మీడియాతో సంబంధం వుండేది కాదు. అందుకని అలాంటివి ఏమైనా తీసుకున్నా కానీ బయటకు వచ్చేవి కాదు.
కానీ ఇప్పుడు ట్విట్టర్, ఇన్‍స్టాగ్రామ్‍లో చిరంజీవి యాక్టివ్ అవడంతో ఆ టెంపుల్ సెట్ బయటకు వచ్చేసింది. ఇది ఇలా లీక్ అవడం కొరటాలకు ఇష్టం లేకపోయినా కానీ మెగాస్టార్ స్వయంగా లీక్ చేసాక ఇక చెప్పడానికేముంటుంది. ఇదిలావుంటే చిరంజీవి ఇలా లీక్ చేయడం చూసి సినిమాలోని ట్విస్టులు కూడా చెప్పేయమంటూ కొందరు చలాకీ కుర్రాళ్లు సరదా ట్రోల్స్ కూడా వేస్తున్నారు.
This post was last modified on January 7, 2021 12:58 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…