Movie News

నాని నెక్స్ట్… ఒకటి డౌట్.. ఒకటి ఫిక్స్?

టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే అతి కొద్దిమంది హీరోల్లో అతనొకడు. అలాంటి హీరో కూడా తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ విషయంలో లెక్క తప్పాడు. మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. రెండోసారి చెప్పినట్లు ఆగస్టులో కూడా రిలీజయ్యేలా లేదు. ఏడాది చివరికి వెళ్లేలా ఉంది.

దీంతో తన తర్వాతి సినిమాల ప్రణాళికలు కూడా దెబ్బ తిన్నాయి. ఈపాటికే చిత్రీకరణ జరుపుకోవాల్సిన సుజీత్ సినిమా ‘బ్లడీ రోమియో’ సంగతి ఎటూ తేలకుండా పోయింది. దీంతో అతను ‘ఓజీ-2’ పనులు మొదలుపెట్టేశాడు. మరి నాని అందుబాటులోకి వచ్చేసరికి సుజీత్ ‘బ్లడీ రోమియో’ను పట్టాలెక్కించే స్థితిలో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ అతను అందుబాటులో లేని స్థితిలో నాని ఎవరితో తన కొత్త చిత్రాన్ని చేస్తాడన్నది ఆసక్తికరం.

ఐతే ఇటీవల ‘బ్లాస్ట్’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుభాష్ కె.రాజ్ దర్శకత్వంలో నాని కథా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే సుభాష్‌తో నాని సంప్రదింపులు జరిపితే జరిపి ఉండొచ్చు కానీ.. వీళ్ల కలయికలో వెంటనే సినిమా వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు. అంతకంటే ముందు వెంకీ అట్లూరితో నాని జట్టు కడతాడని తెలుస్తోంది. సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని పూర్తి చేసిన వెంకీ.. దాని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. తర్వాత అతను ఫ్రీ అయిపోతాడు.

నానికి ఆల్రెడీ ఒక లైన్ చెప్పి ఓకే చేయించుకున్న వెంకీ.. ‘ది ప్యారడైజ్’ పూర్తయ్యే సమయానికి కొత్త స్క్రిప్టుతో రెడీగా ఉంటాడని తెలుస్తోంది. వెంకీ, నాని కాంబినేషన్ గురించి కొన్నేళ్ల ముందే చర్చ జరిగింది. ఇద్దరూ తమ కలయికలో సినిమా కోసం ఆసక్తిగానే ఉన్నారు. ఎట్టకేలకు అది ఓకే అయినట్లు సమాచారం. ఒకవేళ సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’నే నాని ముందు చేసేట్లయితే.. మధ్యలో వెంకీ మరో సినిమా చేసుకుని వస్తాడు. కాస్త ముందో వెనుకో ఈ కలయికలో సినిమా మాత్రం ఖాయం అని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశముంది.

This post was last modified on July 7, 2026 8:05 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

56 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago