గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్ నుంచి అప్డేట్స్ మొదలయ్యాయో అక్కడి నుంచి ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు. పవన్ దర్శకుడు సుజిత్ తో చర్చలు జరిపిన ఫోటోలు బయటికి వచ్చాక హైప్ మరింత పెరిగింది. మొదటి భాగం గత ఏడాది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేశాక దీనికి సీక్వెల్ కావాలని అభిమానులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలించనుంది.
తాజాగా జరిగిన హృదయం మురళి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు తమన్ ని ఆడియన్స్ చాలాసేపు మాట్లాడనివ్వలేదు. అరుపులు ఈలలతో హోరెత్తించారు. చివరికి సెప్టెంబర్ లో ఓజి 2తో కలుద్దాం అని హింట్ ఇచ్చాక అప్పుడు శాంతించారు. అంటే అదే నెలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉంది కాబట్టి అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు చిన్న టీజర్ వచ్చే అవకాశాలున్నాయని వచ్చిన వార్త నిజమని అర్థం చేసుకోవాలి. సో రెండు నెలలు వెయిట్ చేయాలి.
షూటింగ్ ఎప్పటి నుంచి రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు లాంటివి అంత ఈజీగా తేలవు కానీ పవన్ మనసులో వచ్చే సంవత్సరం చివరిలోగా రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే సుజిత్ అవతల నానికి బ్లడీ రోమియో చేయాలి. సో ఓజి 2 మీద ఎక్కువ సమయం గడపడానికి లేదు. ఇది పవన్ కు కూడా తెలుసు. అందుకే తక్కువ వర్కింగ్ డేస్ లో ఎలా పూర్తి చేయొచ్చనే దాని మీద ఇద్దరూ చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారని జనసేన వర్గాల మాట.
ఏదైతేనేం మొత్తానికి ఓజి 2 సెట్స్ పైకి వెళ్ళడానికి రూటు దొరికింది. మరి సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసుకున్న సినిమా సంగతేంటి అంటే ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. ఏది డిసైడ్ చేసుకున్నా పవన్ చేతిలో మహా అయితే ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. తర్వాత ఎన్నికల ప్రణాళికలు, జనసేన అభ్యర్థుల కసరత్తు, సీట్ల పంపకాలు, ప్రచారాలు వగైరా బోలెడు వ్యవహారాలు ఉంటాయి. సో ఓజి2తో పాటు ఇంకొక్క సినిమా చేసే ఛాన్స్ ఉంది. అది సూరిదా కాదా అనేది ఇంకా తేలాలి.
This post was last modified on July 7, 2026 8:19 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…