Movie News

దర్శకత్వాన్ని పంచుకుంటున్న లారెన్స్

రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు ఓకే కానీ.. లారెన్స్ దర్శకుడు కాబోతున్నట్లు వార్తలు వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. అందులోనూ అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో అతణ్ని తన సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడిగా పరిచయం చేస్తుంటే షాకవ్వని వాళ్లు లేరు.

తన దర్శకత్వ ప్రతిభ గురించి సందేహించిన వాళ్లందరికీ ‘మాస్’ మూవీతో తిరుగులేని సమాధానం చెప్పాడు లారెన్స్. ఆ తర్వాత ‘కాంఛన’ సిరీస్‌తో లారెన్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘కాంఛన-4’ కూడా తీస్తున్నాడు లారెన్స్. ఇందులో పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు లోకేష్ కనకరాజ్ ప్రొడక్షన్లో ‘బెంజ్’ అనే మరో క్రేజీ మూవీలో లారెన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కాకుండా సొంత బేనర్లో మరో సినిమాను అనౌన్స్ చేశాడు లారెన్స్. తన కెరీర్లో అది 30వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి మరో పెద్ద విశేషం ఏంటంటే.. లారెన్స్ మరో దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. పుగళ్ అనే కొత్త దర్శకుడితో కలిసి అతను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇండస్ట్రీలో ఇద్దరు దర్శకులు కలిసి ఒక సినిమా తీయడం కొత్తేమీ కాదు.

తెలుగు వాళ్లయిన రాజ్-డీకే సహా కలిసి సినిమాలు చేసే దర్శకుల జాబితా పెద్దదే. కానీ సింగిల్‌గా దర్శకుడిగా చాలా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన లారెన్స్.. ఇప్పుడిలా ఇంకొకరితో కలిసి సినిమా చేయడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం సౌత్ సినిమాలో సెన్సేషన్‌గా మారిన సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు టీజర్‌ను ఈ నెల 12న ప్రకటించనున్నారు. స్వీయ దర్శకత్వంలో ఎక్కువగా హార్రర్ కామెడీలు చేసే లారెన్స్.. మరో దర్శకుడితో కలిసి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

This post was last modified on July 7, 2026 4:22 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

9 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

4 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago