Movie News

రామాయణ డిమాండ్ సగానికి తగ్గిందా?

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే ఒక కొత్త టీజర్ తో దాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. నిర్మాత నమిత్ మల్హోత్రా కొన్ని వారాలుగా ఈ సినిమా థియేటర్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఒక్క మొదటి భాగం నుంచే 500 కోట్ల దాకా ఆశించినట్టు ముంబై వర్గాలు కొంత కాలం క్రితం ప్రచురించాయి. కానీ అందులో సగమే దక్కినట్టు లేటెస్ట్ అప్డేట్.

ధర్మా ప్రొడక్షన్స్ అధిపతి కరణ్ జోహార్ ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇండియా రైట్స్ 250 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఇది మరీ భారీ మొత్తం కాదు కానీ ఒక హిందీ మూవీకి ఈ స్థాయి రేటు పలకడం విశేషమే. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయిపోయి దురంధర్, పుష్ప రేంజ్ లో వేలకోట్ల వసూళ్లు కురిపిస్తే అంగీకరించిన మొత్తంలో స్వల్ప మార్పులు చేసుకునేందుకు పరస్పరం అంగీకారం జరిగిందట. ఇదంతా అధికారికంగా వచ్చింది కాకపోయినా సమాచారమైతే విశ్వసనీయంగా ఉంది.

ఇటీవలే రామాయణ అరగంట ఫుటేజీని కొందరు ప్రముఖులకు చూపించి వాళ్ళ ప్రశంసలు అందుకున్నట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. జూలై వచ్చినా ఇంకా ప్రమోషన్ల వేగం పెరగకపోవడం పట్ల రన్బీర్ కపూర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యష్ టాక్సిక్ ఆగస్ట్ 26 రిలీజ్ కానున్న నేపథ్యంలో దాని రన్ అయ్యాక రామాయణ పబ్లిసిటీ మొదలుపెట్టాల్సిందిగా రిక్వెస్ట్ వచ్చిందట. దానికి అనుగుణంగానే కొంత సైలెంట్ గా ఉన్నట్టు తెలిసింది.

సాయిపల్లవి సీతగా నటించిన రామాయణలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ, కాజల్ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నారు. దర్శకుడు నితేశ్ తివారి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తల మునకలై ఉన్నారు. టీజర్ కు మిశ్రమ స్పందన రావడంతో ట్రైలర్ మీద ఒక్క కంప్లయింట్ రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రామాయణ ఏ తేదీ తీసుకుంటుందనే దాన్ని బట్టి ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు తమ డేట్లని డిసైడ్ చేయాల్సి ఉంది.

This post was last modified on July 7, 2026 3:40 pm

Share

Recent Posts

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

46 minutes ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

3 hours ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

3 hours ago

టికెట్ రేట్ల పంచాయితీలో ‘ప్యారడైజ్’ తర్జన భర్జన

ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…

3 hours ago

ప్రతీకారానికి ఒక్క నిమిషం చాలు.. కానీ నేను ఆ పని చేయలేదు

వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…

4 hours ago

13 రోజుల చిన్నారికి పాస్పోర్ట్ – రికార్డ్ సృష్టించిన తెలుగు బిడ్డ

పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన…

4 hours ago