Movie News

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేయలేదు. అవకాశాలు బోలెడు వచ్చాయి కానీ మరీ ఎగ్జైట్ చేసే కథ ఉంటే తప్ప ఆయన్ని ఒప్పించడం కష్టం. అందుకే రాజమౌళి వారణాసి ఆఫర్ వచ్చేదాకా ఎదురు చూశారు. కుంభగా అందులో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఉంటుందని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ వారం పృథ్విరాజ్ సుకుమారన్ కొత్త మూవీ ‘ఐ నోబడి’ రిలీజవుతోంది. నిస్సామ్ బషీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ టచ్ థ్రిల్లర్ మలయాళంలో 9, తెలుగులో 10న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఏపీ తెలంగాణలో మంచి రిలీజ్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే టైటిల్ కు తగ్గట్టే ప్రస్తుతం మన దగ్గర ఈ సినిమా మీద హైప్ నో బడి కేరింగ్ అన్నట్టు ఉంది. అంటే ఎవరూ పట్టించుకోవడం లేదనే అర్థంలో అన్వయించుకోవచ్చు.

కారణం జూలై 10 లెనిన్ వస్తుండటమే. అఖిల్ కంబ్యాక్ గా పాజిటివ్ వైబ్స్ తో వస్తున్న ఈ విలేజ్ డ్రామా ప్రమోషన్లు పెద్ద ఎత్తున చేశారు. ఈవెంట్, ఇంటర్వ్యూలు ఇప్పటికే కావాల్సినన్ని పూర్తి చేశారు. అందరి కన్ను రిలీజ్ డేట్ మీద ఉంది. మా ఇంటి బంగారం వీకెండ్స్ మినహా స్లో అయిపోవడం, కొత్తగా వచ్చిన రావు బహదూర్ – నాగబంధంకు మిశ్రమ స్పందన దక్కడం ఇప్పుడు లెనిన్ కు కలిసి వచ్చేలా ఉన్నాయి. ట్రేడ్ చాలా మంచి ఓపెనింగ్స్ ఆశిస్తోంది.

సో పృథ్విరాజ్ ఐ నో బాడీ ఎంతో కొంత సౌండ్ చేయాలంటే పబ్లిసిటీ కీలకం కానుంది. ఈ మధ్య డబ్బింగ్ బొమ్మలు మన దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయి. మలయాళం బాలన్ ని ఆహా ఓహో అన్నారు కానీ తెలుగులో వసూలు చేసింది సోసోనే. విజయ్ ఆంటోనీ వంద దేవుళ్ళ పరిస్థితి కూడా అంతే. వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. ఈ ఏడాది వీరభద్రుడు, దురంధర్ రివెంజ్ మాత్రమే వసూళ్లు లాగాయి. మరి ఐ నోబడి ఏ బ్యాచ్ లో చేరుతుందో వేచి చూడాలి.

This post was last modified on July 6, 2026 5:53 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago