Movie News

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్ ఆ లోటు తీర్చిందని భావించిన వాళ్ళు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో సానుకూలత ఎక్కువగా కనిపించింది. నటనతో అదరగొట్టిన సత్యదేవ్ కు సూపర్ డూపర్ హిట్ వచ్చిందేమో అనే రేంజ్ లో హడావిడి కనిపించింది. ఓవర్సీస్ లో స్ట్రాంగ్ ఉన్న మాట వాస్తవమే. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అంత దూకుడు లేదన్నది వాస్తవం.

మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అండ లేకుండా ఏ మూవీ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. కేవలం మూవీ లవర్స్ ని లక్ష్యంగా చేసుకుంటే లాభం లేదు. రావు బహదూర్ ఈ విషయంలో తడబడింది. దర్శకుడు వెంకటేష్ మహా పోస్ట్ రిలీజ్ ప్రెస్ మీట్ లోకి థర్డ్ యాక్ట్, ప్రోబ్లం సొల్వింగ్ అంటూ సాంకేతిక పదాలు వాడేసి నెమ్మదిగా ఉన్న తన టేకింగ్ ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. జనం థియేటర్ కు వచ్చేది స్కూల్ పిల్లల్లా శ్రద్ధగా పాఠం వినడం కోసం కాదు. సరదాగా టైంపాస్ కోసం వస్తారు.

సో టెక్నికల్ గా మనలో ఎంత విషయం ఉందనేది టికెట్లు కొనుక్కునే పబ్లిక్ కి అనవసరం. వాళ్లకు కావాల్సింది రెండున్నర గంటలు సంపూర్ణంగా మెప్పించడం. రోజా, బొంబాయి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తీసిన మణిరత్నం కడలి, చెలియా లాంటి పరమ బోరింగ్ సినిమాలు ఇచ్చారు. కల్ట్ ఫిలిం మేకరే ఇలాంటివి చవి చూడాల్సి వచ్చింది. ఎంగేజ్ చేయకుండా మనం ఎంత గొప్ప కథ రాసుకున్నా అది అన్ని వర్గాలను రీచ్ కాదు. ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే.

రావు బహదూర్ ఖచ్చితంగా రికమండ్ చేయాల్సిన క్యాటగిరీలో వస్తుంది. అలాని కుటుంబం మొత్తం టికెట్లు కొనేసి సంతోషంగా బయటికి పంపించేదా అంటే సమాధానం చెప్పలేం. ఎందుకంటే మా ఇంటి బంగారం, మన శంకరవరప్రసాద్ గారు, పెద్దిలాగా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. ఎక్స్ పెరిమెంట్లు చేసినప్పుడు ఆదరణ పరిమితంగానే ఉంటుంది. ఆ రిస్కుని దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీయాలి. మరి రావు బహదూర్ ఏ స్టాంప్ వేయించుకుంటుందో ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది.  

This post was last modified on July 6, 2026 4:32 pm

Share

Recent Posts

సర్పంచ్ అంటే ఇలా ఆలోచించాలి

నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం యువత పట్టణాలు,…

2 hours ago

అర్జునుడి వెనుక ఇంత మంది పాండవులా

కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…

4 hours ago

2024తో పోలిస్తే కూటమికి ఎంత లాభం? వైసీపీకి ఎంత నష్టం?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…

4 hours ago

చెల్లికి ద్రోహం… తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ సినిమా!

మ‌హిళా సెంటిమెంటు రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది తెలిసిందే. అందునా.. రాజ‌కీయ నేత‌ల కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల విష‌యంలో మ‌రింత‌గా…

5 hours ago

జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. !

"జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్ర‌శ్న‌.…

6 hours ago

జడ్పీ పీఠాలపై వారసుల కన్ను!

పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం…

6 hours ago