Movie News

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త కాదు కానీ స్పై యునివర్స్ పేరుతో యష్ రాజ్ ఫిలింస్ రుద్దుతున్న ఈ గూఢచారి గోలని అర్జెంట్ గా ఆపేయమని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో టైగర్, వార్ లాంటి వాటికి సీక్వెల్స్ తీసే ఆలోచన ఉంటే అవి కూడా మానుకోమంటున్నారు. అలియా భట్, బాబీ డియోల్, శార్వరి పాత్రల మీద ఓ రేంజ్ ట్రోలింగ్ జారుతోంది.

అసలు అవమానం ఇది కాదు. ఐఎండీబిలో కేవలం 2.6 రేటింగ్ సంపాదించుకున్న అల్ఫా తన మీద ఎంత నెగటివిటీ ఉందో నిరూపించుకుంటోంది. బుక్ మై షోలో 8.1 తో ఎదురీదుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత కిందకు వెళ్లడం ఖాయం. ఆదివారం పుణ్యమాని బుకింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి కానీ వారం క్రితం రిలీజైన వెల్కమ్ టు ది జంగల్ కన్నా తక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం. అల్ఫా కన్నా నాగబంధం ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది.

ఇప్పుడీ అల్ఫా ఫలితం యష్ రాజ్ సంస్థని పూర్తిగా డిఫెన్స్ లో పడేసింది. దురంధర్ ప్రభావాన్ని తక్కువంచనా వేయడానికి తగిన మూల్యం చెల్లించుకుంది. లాజిక్స్ మిస్సవ్వడం, యుద్ధాల వల్ల పాకిస్థాన్ కూడా నష్టపోయిందనే రీతిలో సానుభూతి డైలాగులు పెట్టడం, పాత్రల మధ్య విచిత్రమైన లింకులు చూపించడం ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తున్నాయి. మెయిన్ ఆర్టిస్టుల్లో ఒక్క అనిల్ కపూర్ మాత్రం ఎలాంటి క్రిటిసిజం బారిన పడకుండా తప్పించుకున్నారు.

ఇకపై స్పై యునివర్స్ ఉండటం అనుమానమే. ఎందుకంటే పదే పదే ఒక పాయింట్ తో అవే కథలు తిప్పి తిప్పి రాస్తున్న ఆదిత్య చోప్రా కొత్తగా ఏమైనా ఆలోచిస్తారనే నమ్మకం మాకు లేదని మూవీ లవర్స్ అంటున్నారు. దీని ప్రభావం ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్న ధూమ్ 4 మీద పడుతుందేమోనని రన్బీర్ కపూర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్ నాలుగో భాగంలో హీరో తనే కాబట్టి. ఏది ఏమైనా జనాన్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దనే హెచ్చరిక అల్ఫా రూపంలో వచ్చింది.

This post was last modified on July 5, 2026 8:07 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago