మాస్ రాజా రవితేజ నుంచి చివరగా వచ్చిన మూడు సినిమాలూ డిజాస్టర్లే అయ్యాయి. అయినా సరే.. ఆ ప్రభావం ఏమీ ఆయన కొత్త సినిమా క్రాక్ మీద పడలేదు. ఈ సినిమాకు ముందు నుంచి మంచి బజ్ ఉంది. విడుదల దగ్గర పడేసరికి హైప్ మరింత పెరిగింది. రవితేజ మంచి ఫామ్‌లో ఉన్నప్పటి స్థాయిలో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. టీజర్, ట్రైలర్‌లకు తోడు పాటలు కూడా ఎంటర్టైనింగ్‌గా ఉండటం అందుకు కారణం కావచ్చు.
గోపీచంద్ మలినేని, రవితేజ కలయికలో డాన్ శీను, బలుపు లాంటి హిట్ల తర్వాత వస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచింది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే.. సోలోగా సినిమాను రిలీజ్ చేసి ప్రయోజనం పొందాలని చూస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాకు అన్నీ ప్రస్తుతానికి సానుకూలంగానే కనిపిస్తున్నాయి.
కానీ ఇలాంటి సమయంలో క్రాక్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా కాకముందే సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా లేదని.. సెన్సార్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేసి వైరల్ చేసే ప్రయత్నం చేశారు.
తాజాగా ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ కూడా ఉన్న ఒక నార్త్ జర్నలిస్ట్ అయితే.. క్రాక్ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ లేదని, అడ్వాన్స్ బుకింగ్స్ చాలా పూర్‌గా ఉన్నాయని.. ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉండబోతున్నాయని ట్వీట్ వేయడం గమనార్హం. నిజానికి క్రాక్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. సినిమాకు మంచి హైప్ కనిపిస్తోంది. అలాంటి సినిమా గురించి ఇలా ట్వీట్ వేయడం చూస్తే.. ఇదేదో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నెగెటివ్ ప్రచారం లాగా ఉంది. సంక్రాంతికి పోటీలో ఉన్న వేరే సినిమాల వ్యక్తులెవరైనా ఈ పని చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on January 6, 2021 11:56 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…