Movie News

క్రాక్‍ హిట్టయితే నిర్మాతలకు షాక్‍!

రవితేజకు చాలా కాలంగా చెప్పుకోతగ్గ హిట్టు లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం యావరేజ్‍ సినిమా వచ్చి కూడా చాలా రోజులవుతోంది. అయితే ఏ దశలోను రవితేజ పారితోషికం తగ్గించుకోలేదు. తన సినిమాలకు నాన్‍ థియేట్రికల్‍ హక్కులు బాగా వస్తుంటాయి కనుక నిర్మాతలు తనకు అడిగినంత ఇస్తూ వచ్చారు. అయితే లాక్‍డౌన్‍ తర్వాత నిర్మాతలు ఆచి తూచి ఖర్చు పెడుతున్నారు. అందుకే రవితేజను పారితోషికం తగ్గించుకోవాలంటూ డిమాండ్‍ చేస్తున్నారు. ఫ్లాపుల్లో వున్నాడు కనుకే తనను పారితోషికం తగ్గించుకోవాలని డిమాండ్‍ చేస్తున్నారనేది రవితేజకు తెలుసు.

అందుకే క్రాక్‍ విడుదలయ్యే వరకు కొత్త సినిమా సైన్‍ చేయకూడదని డిసైడయ్యాడు. ముగ్గురు నిర్మాతలు తనకు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నా కానీ క్రాక్‍ రిలీజ్‍ తర్వాతే తన రెమ్యూనరేషన్‍ ఎంతనేది ఫిక్స్ చేస్తానంటున్నాడు. క్రాక్‍పై రవితేజ చాలా నమ్మకంతో వున్నాడు. ఇది కానీ క్లిక్‍ అయితే తనతో సినిమా తీద్దామని వచ్చేవాళ్లకు షాక్‍ తప్పదు. మామూలుగానే డజను కోట్లు అడుగుతున్నాడని టాక్‍. ఖిలాడీ చిత్రానికి సింగిల్‍ పేమెంట్‍లో అంత పారితోషికం తీసుకుని సంతకం చేసాడట. ఇక క్రాక్‍ కానీ బ్లాక్‍బస్టర్‍ అయితే రవితేజ డిమాండ్‍ ఎంత వుంటుందో ఏంటో ఊహించసాధ్యం కాదట.

This post was last modified on January 6, 2021 1:56 am

Share
Show comments
Published by
suman

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

5 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

11 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

14 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

15 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

15 hours ago