రవితేజకు చాలా కాలంగా చెప్పుకోతగ్గ హిట్టు లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం యావరేజ్ సినిమా వచ్చి కూడా చాలా రోజులవుతోంది. అయితే ఏ దశలోను రవితేజ పారితోషికం తగ్గించుకోలేదు. తన సినిమాలకు నాన్ థియేట్రికల్ హక్కులు బాగా వస్తుంటాయి కనుక నిర్మాతలు తనకు అడిగినంత ఇస్తూ వచ్చారు. అయితే లాక్డౌన్ తర్వాత నిర్మాతలు ఆచి తూచి ఖర్చు పెడుతున్నారు. అందుకే రవితేజను పారితోషికం తగ్గించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాపుల్లో వున్నాడు కనుకే తనను పారితోషికం తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారనేది రవితేజకు తెలుసు.
అందుకే క్రాక్ విడుదలయ్యే వరకు కొత్త సినిమా సైన్ చేయకూడదని డిసైడయ్యాడు. ముగ్గురు నిర్మాతలు తనకు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నా కానీ క్రాక్ రిలీజ్ తర్వాతే తన రెమ్యూనరేషన్ ఎంతనేది ఫిక్స్ చేస్తానంటున్నాడు. క్రాక్పై రవితేజ చాలా నమ్మకంతో వున్నాడు. ఇది కానీ క్లిక్ అయితే తనతో సినిమా తీద్దామని వచ్చేవాళ్లకు షాక్ తప్పదు. మామూలుగానే డజను కోట్లు అడుగుతున్నాడని టాక్. ఖిలాడీ చిత్రానికి సింగిల్ పేమెంట్లో అంత పారితోషికం తీసుకుని సంతకం చేసాడట. ఇక క్రాక్ కానీ బ్లాక్బస్టర్ అయితే రవితేజ డిమాండ్ ఎంత వుంటుందో ఏంటో ఊహించసాధ్యం కాదట.