Movie News

ఇంకొంచెం ఆగాలంటున్న రణబాలి ?

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సివాలా, శ్యామ్ సింగ రాయ్ తర్వాత చాలా కాలం ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. స్వాతంత్రం రాక ముందు రాయలసీమలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది.

లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే దర్శక నిర్మాతలు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ముందు అనుకున్న రిలీజ్ డేట్ కి చేరుకోవడం కష్టంగా ఉందట. అందుకే వాయిదా తప్పకపోవచ్చని ఫిలిం నగర్ టాక్. ఒకవేళ అదే జరిగితే అక్టోబర్ మూడో వారం అంటే దసరా పండగను టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ రెండు ఎలాగూ ఆదర్శ కుటుంబం ఏకే 47 వస్తుంది కాబట్టి దాని తర్వాత రెండు వారాల గ్యాప్ అంటే సమయం సరిపోతుంది. అయితే కొన్ని చిక్కులు లేకపోలేదు.

విజయదశమిని రజనీకాంత్ జైలర్ 2 టార్గెట్ చేసుకుందని ఆల్రెడీ చెన్నై వర్గాలు ఉటంకిస్తున్నాయి. రజని మిగిలిన సినిమాల సంగతి ఏమో కానీ జైలర్ కు మాత్రం మన దగ్గర భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టే బిజినెస్ ఆఫర్లు క్రేజీగా వస్తున్నాయి. అదే నిజమైన పక్షంలో రణబాలికి తమిళనాడు, కేరళలో థియేటర్ కౌంటర్ పరంగా ఇబ్బంది అవుతుంది. బాలకృష్ణ 111 కూడా అదే పండగ లక్ష్యంగా షూటింగ్ చేస్తున్నారట. కానీ రిలీజ్ ఫైనల్ చేయలేదు.

వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయ్ దేవరకొండకు రణబాలి చాలా కీలకం. ఎందుకంటే కెరీర్ లో మొదటిసారి ఇలాంటి సెటప్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా సీమ యాసలో. పైగా రష్మిక మందన్నతో పెళ్ళయాక ఈ జంట నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. ఇలా చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. రణబాలి విడుదల తేదీని బట్టి ఎంత గ్యాప్ ఉండాలనేది చూసుకుని నిర్మాత దిల్ రాజు తన రౌడీ జనార్ధనను ఫిక్స్ చేస్తారు. బహుశా డిసెంబర్ ఉండకపోవచ్చు.

This post was last modified on June 28, 2026 5:53 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago