రాజకీయాల్లోకి మళ్లీ కొత్తగా వారసులు వస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ వారసులు వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ తెరమీదికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల్లో వీరి హవా ఎక్కువగా ఉంది. గత ఏడాది ఎన్నిక ల్లో టీడీపీ తరఫున ఎక్కువ మంది పోటీకి దిగారు. ఇక, వచ్చే 2024 ఎన్నికల నాటికి ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను ఎక్కువ మంది వారసులే పోటీకి దిగుతారని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది వారసులు తమ తమ ప్రయత్నా లు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొత్తగా మరింత మంది వారసులను రంగంలోకి దింపేందుకు టీడీపీ, వైసీపీ నాయకులు రెడీ అవుతున్నారు.
అయితే.. వారసులు రాజకీయ అరంగేట్రం చేస్తున్నా.. వీరిలో పస
ఎంత ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది ఎన్నికలను పరిశీలిస్తే.. టీడీపీలో భారీ ఎత్తున వారసులు పోటీ చేశారు. అయితే.. గత ఏడాదికి మించి ఎక్కువ మంది వారసులు వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతారనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ వారసులు ఏమేరకు సక్సెస్ అవుతారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. గత ఏడాది ఎన్నికలను పరిశీలిస్తే.. టీడీపీ తరపున పోటీ చేసిన వారిలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీ.. కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తెగా రంగంలోకి దిగి విజయం దక్కించుకున్నారు. ఇక, మిగిలిన వారిలో అందరూ ఓడిపోయారు. భారీ అంచనాలు ఉన్న పరిటాల శ్రీరాం, టీజీ వెంకటేశ్, కేఈ శ్యాంబాబు, గాలి భానుప్రకాశ్ వంటి వారు కూడా ఓటమి పాలయ్యారు.
అయితే.. ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం ఏంటంటే.. వారసులుగా వస్తున్న వారిలో నిబద్దతే కరువు అవుతోంది. కేవలం పదవులను అనుభవించాలనే వ్యూహంతో వస్తున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వీరికి ప్రజాదరణ ఉండడం లేదు. ఇక, వచ్చే ఎన్నికల్లో దివంగత కోడెల కుమారుడు శివరామకృష్ణ, రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు, అయ్యన్నపాత్రుడి కుమారుడు, యనమల రామకృష్ణుడి కుమార్తె.. ఇలా పది మంది వరకు కొత్తగా పోటీకి దిగుతున్నారు. మరి వీరు ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇక, వైసీపీ విషయానికి వస్తే. గత ఏడాది వారసుల రాజకీయాలు తక్కువగానే ఉన్నా.. వచ్చే ఏడాది మాత్రం వీరి సంఖ్య భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
మంత్రులు నారాయణస్వామి కుమారుడు నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు వరకు చాలా మంది నాయకులు తమ వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అయితే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయా వారసులు ప్రజలకు టచ్‌లో ఉంటున్నారా? అనే ది ప్రధాన ప్రశ్న. అటు టీడీపీ అయినా.. ఇటు వైసీపీ అయినా.. నాయకులు ఎవరి దారిలో వారు ఉన్నారు. ఇక, వారసులు రాజకీయాలను ఎంజాయ్ చేయడానికో.. అధికారం చలాయించడానికో .. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు కనెక్ట్ అవుతున్నవారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఏదేమైనా.. వారసులు మళ్లీ తమ భవితవ్యాన్ని తేల్చుకోనుండడం గమనార్హం. మరి ఈసారైనా వీరి సంఖ్య పెరుగుతుందా? లేదా చూడాలి.
This post was last modified on January 5, 2021 5:31 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…