నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాను ఖరారు చేయడానికి చాలా సమయమే తీసుకుంటున్నాడు. గత ఏడాది సంక్రాంతికి ‘ఎంత మంచి వాడవురా’తో పలకరించిన అతను.. ఆ తర్వాత ఇప్పటిదాకా కొత్త సినిమాను ప్రకటించలేదు. ‘118’తో ఫామ్‌లోకి వచ్చిన నందమూరి హీరోకు ‘ఎంత మంచివాడవురా’ మంచి విజయాన్నందిస్తుందనుకుంటే.. కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో తర్వాత ఎలాంటి సినిమా ఎంచుకోవాలనే విషయంలో అతను అయోమయంలో పడ్డాడు.
మారుతి ఓ కథ చెప్పగా.. దాన్ని కళ్యాణ్ రామ్ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. పవన్ సాధినేని దర్శకత్వంలో అనుకున్న సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది. ఇంకేవో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి కానీ.. ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
గత ఏడాది మలయాళంలో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘అంజామ్ పత్తిర’ ఒకటి. కుంచుకోబోబన్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్లో ఒకరి తర్వాత ఒకరు అదృశ్యం కావడం.. తర్వాత వాళ్లు దారుణంగా హత్యకు గురి కావడం.. అందులో ఒక ప్యాటెర్న్ కనిపించడం.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారిన ఈ కేసును ఛేదించడానికి మానసిక వైద్య నిపుణుడైన హీరో రంగంలోకి దిగడం.. ఈ నేపథ్యంలో ‘అంజామ్ పత్తిర’ నడుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ.. థ్రిల్‌కు గురి చేస్తూ సాగే ‘అంజామ్ పత్తిర’ థ్రిల్లర్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకుముందు కళ్యాణ్ రామ్‌లో ‘118’ అనే థ్రిల్లర్ తీసిన గుహన్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇద్దరూ తెలుగు రీమేక్ స్క్రిప్టు మీద చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on January 5, 2021 2:07 pm
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…