తమిళనాట విజయ్ ఎప్పట్నుంచో టాప్ స్టార్లలో ఒకడిగా ఉన్నాడు కానీ.. గత అయిదారేళ్లలో అతను తన ఫాలోయింగ్, క్రేజ్‌ను విస్తరించిన తీరు అనూహ్యం. తమిళంలోనే కాక సౌత్ ఇండియాలోనే రజినీకాంత్‌ను మించిన స్టార్ లేడు, ఇక రాడు అనుకుంటున్న సమయంలో విజయ్ వరుస బ్లాక్‌బస్టర్లతో తన స్థాయిని అమాంతం పెంచుకున్నాడు.
అతడి సినిమాల బిజినెస్, కలెక్షన్లు అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. తమిళనాడు అవతల కూడా అతడి ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో రజినీకాంత్ సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వచ్చాయి. చూస్తుండగానే రజినీని మించిన స్టార్ అయిపోయాడు విజయ్. అతడి కొత్త సినిమా మాస్టర్ మీద అంచనాలు మామూలుగా లేవు. పది నెలల నుంచి ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి బిజినెస్ ఓ రేంజిలో జరిగింది. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా వసూళ్ల మోత మోగించడం, కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమనే అనుకుంటున్నారు.
కరోనా విరామం తర్వాత మంచి సినిమా వస్తే థియేటర్లలో చూడాలని తమిళ ప్రేక్షకులు తహతహలాడుతుండగా.. మాస్టర్ లాంటి భారీ చిత్రం విడుదల కానుండటం వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఆవురావురుమని ఉన్న వారికి మాస్టర్ విందు భోజనం అవుతుందని భావిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటిదాకా ఏ చిత్రాన్ని విడుదల చేయని స్థాయిలో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. అందులోనూ 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి తమిళనాడు తాజాగా అనుమతులు ఇవ్వడం మాస్టర్‌కు మామూలు బూస్ట్ కాదు.
మెజారిటీ థియేటర్లలో సినిమా రిలీజవుతుండగా.. ఆక్యుపెన్సీ పరంగానూ ఇబ్బంది లేకపోవడంతో కలెక్షన్ల మోత మామూలుగా ఉండదని అంచనా వేస్తున్నారు. అన్నీ కలిసొస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సౌత్ ఇండియాలో నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 13న ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 4, 2021 10:02 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…