Movie News

అడ్రస్ లేని సినిమా గురించి మెగా హీరో ఏమన్నాడు?

సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను మొదలుపెట్టారు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సినిమా మొదలైనపుడు గత ఏడాది దసరాకే రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ ఆ దసరా ఎప్పుడో పోయింది. ఇంకో దసరాకైనా సినిమా రిలీజవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

కొన్ని నెలల నుంచి ఈ చిత్రం గురించి ఏ అప్‌డేట్ లేదు. అనుకున్న బడ్జెట్‌ ఎప్పుడో ఖర్చయిపోయిందని.. వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఇంకా సినిమా పూర్తి కాలేదని.. ఈ చిత్రాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో, బడ్జెట్ ఎలా రికవర్ చేయాలో తెలియక నిర్మాత సతమతం అవుతున్నాడని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. టీం ఆ ప్రచారాన్ని ఖండించలేదు. సినిమా గురించి అప్‌డేటూ ఇవ్వలేదు. హీరో సహా మీడియాకు కూడా దొరకలేదు.

ఐతే ‘సంబరాల యేటి గట్టు’ నిర్మాత తమ సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టిన ‘హనుమాన్’ చిత్రాన్ని త్రీడీలో రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన తేజు మీడియాకు అందుబాటులోకి వచ్చాడు. అక్కడ అతడికి ‘సంబరాల యేటి గట్టు’ గురించి మెగా ఫ్యాన్స్ నుంచి ప్రశ్న ఎదురైంది.

కాస్త ఇబ్బంది పడుతూనే సమాధానం చెప్పాడు తేజు. ఓటీటీలో వివిధ భాషల ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ ప్రేక్షకులు చాలా తెలివి సంపాదిస్తున్నారని.. ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని తేజు అన్నాడు.

ప్రస్తుతం ఆషామాషీ కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సంతృప్తి చెందట్లేదని.. అందుకే తాను సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని.. అందుకే టైం తీసుకుని సినిమాను రెడీ చేస్తున్నామని అన్నాడు. ఐతే తేజు సమాధానం ఏదో కవరింగ్‌లా ఉందే తప్ప.. అసలు ‘సంబరాల యేటి గట్టు’ స్టేటస్ ఏంటి.. ఆ చిత్రం ఎప్పుడు రిలీజవుతుంది అన్నది మాత్రం అతను వెల్లడించకపోవడం మెగా అభిమానులను నిరాశపరిచింది.

This post was last modified on June 22, 2026 10:26 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago