టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్లతో తీన్ మార్, గబ్బర్ సింగ్.. బాద్ షా, టెంపర్ లాంటి భారీ చిత్రాలు నిర్మించడం అందరికీ షాకింగే. ఉన్నట్లుండి అతను అంత పెద్ద నిర్మాత ఎలా అయ్యాడో అని అప్పట్లో తెగ చర్చించుకున్నారు.
పవన్ కళ్యాణ్‌తో తన స్నేహం కూడా అందరినీ ఆశ్చర్యాన్నే కలిగించింది. ఇండస్ట్రీలో పవన్‌కు ఎంతోమంది అభిమానులున్నారు కానీ.. అందిరిలోకి బండ్లనే వీరాభిమానిలా కనిపిస్తుంటాడు. వ్యక్తిగతంగా కూడా పవన్‌కు చాలా దగ్గరగా మెలిగిన అతను.. మధ్యలో కొంచెం దూరమైనట్లు కనిపించాడు. తిరిగి పవన్‌తో ఓ సినిమా చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసే కారణం అనే చర్చ జరిగింది ఒక టైంలో.
బండ్ల సైతం పవన్‌కు తనను దూరం చేస్తోంది త్రివిక్రమే అన్నట్లుగా ఒక సందర్భంలో పవన్ అభిమానితో ఫోన్ కాల్‌లో మాట్లాడడం.. లీకైన ఆ ఆడియో సంచలనం రేపడం గుర్తుండే ఉంటుంది. త్రివిక్రమ్‌ను ఆ ఆడియోలో బండ్ల బూతులు తిట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ఆ ఆడియో తనది కాదు అంటూ మాట మార్చకుండా మరో సందర్భంలో త్రివిక్రమ్ కు సారీ చెప్పాడు కానీ ఆయనతో పెద్దగా సన్నిహితంగా మెలిగింది లేదు.
కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ను కలవడమే కాక ఆయన మీద ప్రశంసలు కురిపిస్తూ బండ్ల ఎక్స్‌లో పోస్టు పెట్టడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ పోస్టులో ఆయన్ని బండ్ల అభిమానుల తరహాలో గురూజీ అని సంబోధించడం విశేషం.
“థాంక్యూ గురూజీ.🙏 మీ ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, చల్లగా ఉండాలని, ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తూ, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి థాంక్యూ గురూజీ. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని ముగించాడు బండ్ల. రాజకీయాల్లో మాదిరే సినీ రంగంలోనూ శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి బండ్ల.. త్రివిక్రమ్ మీద ఇప్పుడు కురిపిస్తున్న ప్రేమే నిదర్శనం.
This post was last modified on June 21, 2026 4:43 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…