Movie News

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. పోస్టర్స్ తోనే బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ బయటకు వచ్చింది. నార్మల్ గా కమర్షియల్ యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లంటే కేవలం గ్లామర్ షో, పాటలకే పరిమితం అనుకుంటాం. కానీ ఈ పోస్టర్ చూస్తే మాత్రం ఆ రొటీన్ ఫార్మాట్ కు భిన్నంగా డైరెక్టర్ ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు అర్ధమవుతుంది.

ఈ ఫస్ట్ లుక్ లో కాజల్ చాలా ఇంటెన్స్ అవతార్ లో కనిపిస్తోంది. కళ్లజోడు, సింపుల్ కాటన్ చీర, నుదుటిన చిన్న బొట్టు, సీరియస్ చూపులతో ఆమె క్యారెక్టర్ లోని డెప్త్ ఏంటో ఒకే ఒక్క ఫోటోతో ఎలివేట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో పాతకాలపు ఆఫీస్ టేబుల్, ఫైళ్లు, లీగల్ స్టాంపులు గమనిస్తే.. ఈ కథలో ఆమె పవర్ ఫుల్ ప్రభుత్వ అధికారిణి లేదా లాయర్ పాత్రలో కనిపించే అవకాశం ఉందనిపిస్తోంది.

ఈ సినిమా 1993 బాంబే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని మేకర్స్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. పైగా ఇందులో మెయిన్ విలన్ గా మంచు మనోజ్ లాంటి బలమైన నటుడు ఉన్నాడు. ఒకవైపు అండర్ వరల్డ్ క్రైమ్, మరోవైపు బాలయ్య మార్క్ యాక్షన్ కు మధ్యలో కాజల్ క్యారెక్టర్ చాలా కీలకంగా మారబోతోందని ఈ పోస్టర్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె టేబుల్ పై ఉన్న ఆ ఫైళ్లకు, బాంబే మాఫియాకు ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉండేలా కథను రాసుకున్నట్లు అనిపిస్తుంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో కాజల్ లుక్ ఇప్పుడు ఆడియన్స్ కు సరికొత్త ఫీల్ ఇస్తోంది. నటనకు స్కోప్ ఉన్న ఇలాంటి సీరియస్ రోల్ ను ఆమె ఎంచుకోవడం మంచి విషయమే. కేవలం హీరోకు జోడీగా కాకుండా కథను ముందుకు నడిపే స్ట్రాంగ్ క్యారెక్టర్ లో ఆమె ఎలా మెప్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

This post was last modified on June 19, 2026 4:55 pm

Share

Recent Posts

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

1 minute ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

1 hour ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

1 hour ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

1 hour ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago