బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పొలిటికల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ సక్సెస్ తో పాటు దీని చుట్టూ కొన్ని వివాదాలు, రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా స్క్రిప్ట్ అంతా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ PMO నుంచి వచ్చిందంటూ నెట్టింట ఒక ప్రచారం సాగింది. అయితే రీసెంట్ గా ఈ రూమర్స్ పై చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ యాక్టర్ రాకేష్ బేడి స్పందించారు.
న్యూ ఢిల్లీలో జరిగిన ఒక సమ్మిట్ లో పాల్గొన్న రాకేష్ బేడి సినిమా విశేషాలను పంచుకుంటూ ఈ పీఎంఓ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కొందరు కావాలనే ఈ కథ పీఎంఓ నుంచి రాసి ఇచ్చారంటూ ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. సినిమాలో ఉన్న కొన్ని బోల్డ్ అండ్ రా డైలాగులను గుర్తు చేస్తూ.. పీఎంఓ లో ఉండే ఏ అధికారి అయినా ఇలాంటి లైన్స్ రాయగలరా అని ప్రశ్నించారు. అలాంటి ఆఫీస్ లో ఉన్నవాళ్లు కలలో కూడా ఇలాంటి డైలాగులు ఆలోచించలేరని, కాబట్టి ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టిపారేశారు.
నిజానికి ఈ ధురంధర్ సిరీస్ సినిమాల్లో పొలిటికల్ యాంగిల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అప్పట్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, గత ప్రభుత్వాలను తక్కువ చేసి చూపేలా కొన్ని సీన్స్ ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఒక కమర్షియల్ యాక్షన్ సినిమాగా చూస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అలాగే ఆదిత్య కూడా ఇదివరకే ఈ తరహా విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.
ఇక ఈ ఫ్రాంచైజీలో రాకేష్ బేడి పోషించిన జమీల్ జమాలి క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా సర్ ప్రైజ్ చేసింది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ ట్విస్ట్ కథకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. అయితే ఈ క్యారెక్టర్ కు ఉన్న ఇంటెన్సిటీతో పాటు సినిమాలో అక్కడక్కడా వచ్చే కామెడీ మూమెంట్స్ కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ హ్యుమర్ అంతా తన సొంత ఐడియా అని రాకేష్ బేడి ఈ సందర్భంగా బయటపెట్టారు. ఏదేమైనా స్క్రిప్ట్ వెనుక ఉన్న వివాదాలకు ఒక సీనియర్ నటుడి నోటి నుంచే పక్కా వివరణ రావడంతో ఈ రూమర్స్ కు ఇప్పటికైతే చెక్ పడినట్లే అనిపిస్తోంది.
This post was last modified on June 18, 2026 5:06 pm
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…
కొన్నిసార్లు దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా తీయలేకపోతుంటారు. అందుకు అనుభవ లేమి కూడా కారణం కావచ్చు. లేదంటే రాత…
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…