Movie News

స్టూడియో క‌ట్టాల‌ని బ‌న్నీకి ఎందుక‌నిపించింది?


టాలీవుడ్లో అక్కినేని కుటుంబానికి అన్న‌పూర్ణ పేరుతో పెద్ద స్టూడియో ఉంది. నంద‌మూరి ఫ్యామిలీకి రామ‌కృష్ణ స్టూడియోస్ ఉంది. అలాగే ద‌గ్గుబాటి వారి రామానాయుడు స్టూడియోస్ గురించీ తెలిసిందే. ఐతే టాలీవుడ్లో అతి పెద్ద ఫ్యామిలీస్‌లో ఒక‌టైన మెగా కుటుంబానికి మాత్రం స్టూడియో లేదు. గీతా ఆర్ట్స్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లో నాలుగు ద‌శాబ్దాలుగా సినిమాలు నిర్మిస్తున్న అల్లు అర‌వింద్ ఇప్ప‌టిదాకా స్టూడియో ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఐతే ఎట్ట‌కేల‌కు అల్లు పేరుతో స్టూడియో నిర్మాణానికి ఇటీవ‌లే పునాది ప‌డింది. ఐతే ఈ స్టూడియో ఆలోచ‌న అర‌వింద్‌ది కాద‌ట‌. ఆయ‌న కొడుకు అల్లు అర్జున్‌ద‌ట‌. అత‌నే స్టూడియో నిర్మిద్దామ‌ని తండ్రికి చెప్పి, ఆయ‌న‌తో పాటు కుటుంబంలో అంద‌రినీ ఒప్పించాడ‌ట‌. ఐతే త‌న‌కా ఆలోచ‌న రావ‌డానికి కార‌ణ‌మేంటో ఆహాలో ప్ర‌సార‌మ‌వుతున్న సామ్ జామ్ షోలో బ‌న్నీ వెల్ల‌డించాడు.

ఈ షోలో స‌మంత‌ను ఉద్దేశించి బ‌న్నీ మాట్లాడుతూ మీకు కూడా స్టూడియో ఉంది క‌దా (అన్న‌పూర్ణ‌), అలాగే పెద్ద ఫ్యామిలీస్ అన్నింటికీ స్టూడియోలున్నాయి.. మన‌కు కూడా ఒక స్టూడియో ఉంటే బాగుణ్నే అని ఎప్ప‌ట్నుంచో అనుకుంటూ ఉండేవాడిని. ఒక‌సారి అన్న‌పూర్ణ స్టూడియోలో షూటింగ్ కోసం వెళ్లిన‌పుడు అక్క‌డి వ్య‌క్తి ఒక‌రు వెల్క‌మ్ టు అన్న‌పూర్ణ స్టూడియో సార్ అన్నాడు. ఆ పిలుపు విన్న‌పుడు కూడా మ‌న‌కు కూడా ఇలా ఓ స్టూడియో ఉంటే బాగుంటుంది క‌దా అనిపించింది. అందుకే ఈ మ‌ధ్య నాన్న‌తో మాట్లాడి స్టూడియో నిర్మిద్దామ‌ని అన్నా. కుటుంబంలో అంద‌రూ ఒప్పుకోవ‌డంతో స్టూడియో నిర్మాణం మొద‌లైంది.

నేను ఉన్నంత వ‌ర‌కు సినిమాల్లో న‌టిస్తూనే ఉంటా. అంత కాలం నాకు స్టూడియో ఉప‌యోగ‌ప‌డుతుంది.. అలాగే ఇండ‌స్ట్రీకి కూడా మ‌నం ఒక ప్ర‌పంచ స్థాయి స్టూడియో అందించాలి అన్న ఉద్దేశంతో ఈ స్టూడియో నిర్మాణం మొద‌లుపెట్టాం అని బ‌న్నీ తెలిపాడు.

This post was last modified on January 4, 2021 7:05 am

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

17 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

37 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago