లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఇతనొకడు. నగరం అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇతను.. ఆ సినిమాతో ఓ మోస్తరు ఫలితాన్నే అందుకున్నాడు. కానీ లోకేష్ రెండో సినిమా ఖైదీ మాత్రం అతడికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా పెద్ద లీగ్‌లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసింది.
ఆ సినిమా సూపర్ హిట్టవడంతో ఏకంగా విజయ్ లాంటి సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు లోకేష్. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ముందే అందరూ ఫిక్సయిపోయారు.ఈ చిత్రం విడుదల కాకముందే లోకనాయకుడు కమల్ హాసన్‌తో విక్రమ్ అనే సినిమా మొదలుపెట్టాడు లోకేష్. ఆ సినిమా టీజర్ కూడా అదిరిపోయే రేంజిలో ఉండటంతో లోకేష్ డిమాండ్ ఇంకా పెరిగిపోయింది.
లోకేష్ త్వరలోనే తెలుగులోకి కూడా అరంగేట్రం చేయొచ్చని ఒక ప్రచారం నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అతడికి అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. కాగా లోకేష్.. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాస్టర్ ప్రమోషన్ల సందర్భంగా ఓ తమిళ ఇంటర్వ్యూలో లోకేషే స్వయంగా అంగీకరించాడు.
రామ్ చరణ్‌తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది, అందులో నిజమెంత అని ఇంటర్వ్యూయర్ లోకేష్‌ను అడగ్గా.. చర్చలు జరిగిన మాట వాస్తవం, అయితే ఒక సమయంలో ఒక సినిమానే చేయాలి కాబట్టి ప్రస్తుతం కమల్ హాసన్‌తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు సంగతి చూస్తానని లోకేష్ అన్నాడు. మరి మైత్రీ బేనర్లోనే ఈ సినిమా చేస్తాడా.. ఈ చిత్రం ఎప్పటికి పట్టాలెక్కుతుంది అన్నది క్లారిటీ లేదు కానీ.. చరణ్-లోకేష్ కాంబినేషన్లో ఒక సినిమా అయితే గ్యారెంటీ అన్నమాట.
This post was last modified on January 3, 2021 8:46 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…