Movie News

అబ్సెషన్ మూవీకి నీలాంబరి కనెక్షన్

బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్ ప్రియులను కట్టిపడేస్తున్న ఈ సినిమా పెద్ది వల్ల ఏపీ తెలంగాణ బిసి సెంటర్స్ లో ఆలస్యంగా రిలీజయ్యింది. అయినా సరే హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు డబ్బింగ్ చేయకపోయినా, చాలా చోట్ల సబ్ టైటిల్స్ అందుబాటులో లేకపోయినా దీన్ని ఖచ్చితంగా చూడాలని ఫిక్సైన మూవీ లవర్స్ థియేటర్లకు వెళ్లిపోతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ మరి నీలాంబరి కనెక్షన్ ఏంటో చూద్దాం. అబ్సెషన్ లో ఉన్న మెయిన్ పాయింట్ ఇష్టపడిన అబ్బాయి మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న ఒక అమ్మాయి దాని కోసం ఎంతకైనా తెగించడం చివరికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడకపోవడం అబ్సెషన్ లో ఉన్న కథాంశం. 1999లో వచ్చిన రజనీకాంత్ నరసింహలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి క్యారెక్టర్ ఇంచుమించు ఇదే ఛాయల్లో ఉంటుందని ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే లింక్ అవుతుంది.

నరసింహలో రజనీకాంత్ కు సౌందర్యతో పెళ్లి ఫిక్స్ అయ్యాక అది జరగకూడదని రమ్యకృష్ణ ఎద్దుని రెచ్చగొట్టి ఆ అమ్మాయిని చంపాలని చూస్తుంది. కానీ సౌత్ సినిమా కాబట్టి హీరో ఎంట్రీ ఇచ్చి ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కాపాడేస్తాడు. ఆ తర్వాత నీలాంబరి పిచ్చదానిలా సంవత్సరాల తరబడి చీకటి గదిలో మగ్గిపోతుంది. దీనికి కొంచెం దగ్గరగా అంతకు ముందే రమ్యకృష్ణ ఈవీవీ సత్యనారాయణగారు తీసిన ఆయనకు ఇద్దరులో ఒక క్యారెక్టర్ చేశారు. అందులో జగపతిబాబు హీరో.

వినడానికి కొంచెం సిల్లీగా అనిపించినా అబ్సెషన్ లాంటి కాన్సెప్ట్స్ మనోళ్లు ఎప్పుడో టచ్ చేశారని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఓంకారంలో హీరోయిన్ ప్రేమ వెంట పడే రాజశేఖర్ లో కూడా ఇలాంటి పోలికలే గమనించవచ్చు. తరుణ్ ప్రియమైన నీకులో సెకండ్ హీరోయిన్ కు ఈ తరహా టచ్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి. మొత్తానికి ఫైనల్ రన్ అయ్యేలోపు అబ్సెషన్ ఇండియా వైడ్ వంద కోట్ల దాకా వసూలు చేయొచ్చని ట్రేడ్ అంచనా.

This post was last modified on June 14, 2026 6:07 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

2 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

6 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

8 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

9 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

11 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

12 hours ago