Movie News

డ్యూడ్-2… అవసరమా?

గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన మూడో చిత్రమిది. అనూహ్యంగా పెరిగిన ప్రదీప్ క్రేజ్‌ను ఈ సినిమా బాగా ఉపయోగించుకుంది. దీపావళి పండుగ సీజన్లో రావడం, సరైన పోటీ లేకపోవడం కూడా దీనికి ప్లస్ అయింది. ఐతే ప్రదీప్ తొలి రెండు చిత్రాలతో పోలిస్తే ఇది వీక్ మూవీ అనడంలో సందేహం లేదు.

ప్రదీప్ పెర్ఫామెన్స్, పాటలు, కొన్ని ఎపిసోడ్ల వల్ల సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కేసింది కానీ.. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలామందికి జీర్ణం కాలేదు. హీరో ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం.. హీరోకు భార్యగా మారి, లవర్‌తో కడుపు చేయించుకోవడం లాంటి అంశాల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఓటీటీలో వచ్చినపుడు ఈ సినిమాను ఎలా హిట్ చేశార్రా బాబూ అంటూ చాలామంది నెగెటివ్ కామెంట్లు పెట్టారు.
ఐతే కొన్ని సినిమాల్లో కంటెంట్ అంత బలంగా లేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు, టైమింగ్ కలిసొచ్చి హిట్టయిపోతుంటాయి. ‘డ్యూడ్’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే అని చెప్పొచ్చు.

ఇప్పుడు రిలీజైతే ఈ సినిమా ఆడుతుందా అన్నది డౌటే. ఎలాగోలా అప్పుడు గట్టెక్కేసినందుకు హ్యాపీగా ఫీలవ్వాలి కానీ.. దీనికి సీక్వెల్ తీయలనుకోవడం మాత్రం టూమచ్ అనే చెప్పాలి. దర్శకుడు కీర్తీశ్వరన్ ఇప్పుడు ఇదే ఆలోచన చేస్తున్నాడు. ‘డ్యూడ్-2’కు సంబంధించి తాను ఒక ఆలోచనను ప్రదీప్‌కు చెప్పానని, అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీక్వెల్ తీస్తానని కీర్తీశ్వరన్ తాజాగా ప్రకటించాడు.

ఐతే ‘డ్యూడ్’ లాంటి మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చిన సినిమాకు సీక్వెల్ అంటే ప్రేక్షకుల నుంచి ఆమోదం ఉంటుందా అన్నది ప్రశ్న. పైగా ఇంకా ఆ కథను సాగదీయడానికి ఏముంది అనే అనుమానం కూడా కలుగుతుంది. ఆల్రెడీ ‘ఎల్ఐకే’ చిత్రంతో ఎదురు దెబ్బ తిన్న ప్రదీప్.. ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలను ఎంచుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ప్రదీప్ స్వయంగా దర్శకుడు, అన్నీ తెలిసిన వాడు కాబట్టి ‘డ్యూడ్’ సీక్వెల్‌కు అతను పచ్చజెండా ఊపుతాడా అన్నది సందేహమే.

This post was last modified on June 14, 2026 7:47 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

3 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

7 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

9 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

10 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

12 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

12 hours ago