Movie News

ఐశ్వర్య చెప్పింది నిజమేనా?

ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు పెద్దగా అంచనాలు లేని చిత్రాలు కూడా ఇరగాడేస్తుంటాయి. చిన్న సినిమాలు కూడా ప్రభంజనం సృష్టిస్తుంటాయి. ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్‌కే పట్టం కడుతున్నారు. సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా చూస్తున్నారు. ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించింది తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్.

ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ సుకుమారీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాను కలిసిన ఆమెకు.. తమిళ సినీ పరిశ్రమలో పరిస్థితుల గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయిపోయాడు, అజిత్ సినిమాలు చేయట్లేదు.. ఈ నేపథ్యంలో కోలీవుడ్లో ఒక శూన్యత నెలకొంది కదా అని అడిగితే ఐశ్వర్య పరిణతితో కూడిన జవాబు చెప్పింది.

విజయ్ లేకపోయినా, అజిత్ సినిమా చేయకపోయినా.. తమిళ సినిమా పరిస్థితి ఏమీ ఇబ్బందికరంగా లేదని.. ఇటీవల ‘కరుప్పు’ సినిమా ఎంత బాగా ఆడిందో తెలుసు కదా అని ఆమె ఉదాహరణ చూపించింది. దీంతో పాటు హలీవుడ్ మూవీ ‘అబ్సెషన్’ గురించి ఐశ్వర్య మాట్లాడింది. ఆ సినిమాలో మనకు తెలిసిన నటీనటులు ఎవరున్నారు.. మరి పది కోట్ల ఖర్చుతో తయారైన ఆ సినిమాకు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు ఎలా వచ్చాయి అని ఐశ్వర్య ప్రశ్నించింది.

ఆ సినిమాలో భావోద్వేగాలకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారు.. అందులో అమ్మాయి నోనోనో అంటుంటే మన ఆడియన్స్ ఎందుకు అంత ఫీలయ్యారు అని ఆమె పేర్కొంది. ప్రేక్షకులకు భాషతో కానీ.. స్టార్లతో కానీ సంబంధం లేదని.. వాళ్లు కనెక్ట్ అయ్యే సినిమా ఇస్తే దాన్ని ఆదరిస్తారని ఐశ్వర్య అభిప్రాయపడింది. కంటెంట్ ఈజ్ కింగ్ అని.. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే విషయాన్ని ఐశ్వర్య ఉదాహరణ పూర్వకంగా నొక్కి వక్కాణించింది.

అయితే స్టార్ పుల్ అనేది వేరని, సినిమా ఎలా ఉన్నా సరే అదిరిపోయే ఓపెనింగ్ పడాలంటే అది కేవలం స్టార్ హీరోల వాళ్ళే సాధ్యమని అంటున్నారు. ఓపెనింగ్ అంటే విజయ్ పేరు మీద ఉన్న రికార్డులు ఎన్నో చెప్పలేం. మరి విజయ్, అజిత్ లాంటి స్టార్లు ఇండస్ట్రీకి దూరం అయితే అటువంటి ఓపెనింగ్ రికార్డులు పడవని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on June 13, 2026 4:26 pm

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

1 hour ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

2 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

3 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

3 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

4 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

5 hours ago