Movie News

లెనిన్ మళ్ళీ మాట తప్పితే ఎలా

మొన్నటిదాకా జూన్ 26 రావడం పక్కాని పదే పదే ప్రమోషన్లలో ఊదరగొట్టిన లెనిన్ మళ్ళీ వాయిదా పడిందనే వార్త అభిమానుల్లో గుబులు రేపుతోంది. కారణాలు ఏమైనా వాళ్ళు ఈ పరిణామాన్ని అంత సులభంగా స్వాగతించేలా లేరు. ఎందుకంటే ఇప్పటికే లెనిన్ చాలా పోస్ట్ పోన్లు తీసుకుంది. ఏప్రిల్ లోనే వస్తుందనుకున్న టైంలో పెద్ది కోసం త్యాగం చేశామంటూ తొందరపడి ప్రకటన ఇచ్చిన టీమ్ ఇప్పుడు రెండు నెలల తర్వాత కూడా మాట తప్పితే సోషల్ మీడియా ఫ్యాన్స్ ఊరుకుంటారా.

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హఠాత్తుగా లెనిన్ ప్రమోషన్లు ఆపేయడం దానికి సంకేతంగా భావిస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండటం, ఇంకా ఫైనల్ కాపీ సిద్ధం కాకపోవడంతో తమన్ తన ఓజి టూర్ పనుల్లో బిజీ అయిపోవడం, ఓటిటి డీల్ కు సంబంధించి చివరి నిమిషం ఏదో అడ్డంకి రావడం ఇలా రకరకాల రీజన్స్ లెనిన్ కు అడ్డంకిగా మారాయని అంటున్నారు. అందుకే నిర్ణయం మార్చుకున్నారట.

ఏది ఏమైనా ఈసారి అఖిల్ ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు. ఎక్స్, ఇన్స్ టా వేదికగా గట్టిగానే తలంటడం ఖాయం. తమ హీరోకు ఖచ్చితంగా మాస్ కంబ్యాక్ గా లెనిన్ నిలుస్తుందని వాళ్లకు దీని మీద చాలా ఆశలున్నాయి. పాటలు, టీజర్ కాసింత నమ్మకాన్ని కలిగించాయి. వీటిలో చూపించని షాకింగ్ కంటెంట్ థియేటర్లలో థ్రిల్ ఇస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు వీలైనంత వరకు అవకాశాన్ని పోగొట్టుకోకుండా చూడాలి.

ఎలాగూ పెద్ది జూన్ చివరి వారంకల్లా ఫైనల్ రన్ కు వచ్చేస్తుంది. లెనిన్ కు మంచి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు తప్పుకోవడం వల్ల ఆ అడ్వాంటేజ్ ని రావు బహదూర్ లాంటివి వాడుకుంటాయి. లెనిన్ కన్నా వారం ముందు వచ్చే సమంత మా ఇంటి బంగారంకు కూడా ఇది కలిసి వచ్చే విషయమే. రిలీజ్ గురించి ఆ మధ్య నొక్కి వక్కాణించిన నిర్మాతలు నాగార్జున, నాగవంశీలు ఇపుడేమంటారో చూడాలి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన లెనిన్ కు అఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ పెట్టారు.

This post was last modified on June 13, 2026 9:24 am

Share

Recent Posts

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

1 minute ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

39 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

2 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

2 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

4 hours ago