Movie News

మల్లు అర్జున్ క్రేజ్ చెక్కు చెదరలేదు

మనం తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి వాళ్ళను నెత్తినబెట్టుకుని చూస్తాం కానీ మనోళ్ళను వాళ్ళు పిచ్చ లైట్ తీసుకుంటారు. ఏవో బాహుబలి లాంటి ఒకటి రెండు మినహాయించి మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన డబ్బింగ్ చిత్రాలు తమిళనాడులో ఆడిన దాఖలాలు తక్కువే. కర్ణాటకలో తెలుగు జనాభా గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ డబ్బింగ్ అవసరం లేకుండానే ఆడతాయి కానీ కేరళలో పరిస్థితి వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

మోహన్ లాల్, మమ్ముట్టికి తెలుగులో ఉన్న గుర్తింపు చిరంజీవి, బాలకృష్ణకు మల్లువుడ్ లో లేదు. తర్వాత ఎందరో అక్కడ జెండా పాతాలని ట్రై చేశారు కానీ పనవ్వలేదు. దాంతో ఆ మార్కెట్ ని లైట్ తీసుకున్న దాఖలాలు ఎక్కువ. కానీ అల్లు అర్జున్ అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించాడు. ఇంటి పేరుని అక్కడి ఫ్యాన్స్ మల్లుగా మార్చుకునే స్థాయిలో మార్కెట్ పెంచుకున్నాడు. దానికి తాజా నిదర్శనంగా హ్యాపీ రీ రిలీజ్ ని చెప్పుకోవచ్చు.

తాజాగా 4కె వెర్షన్ లో మలయాళంలో హ్యాపీని మళ్ళీ విడుదల చేశారు. అనూహ్యంగా హౌస్ ఫుల్ కలెక్షన్లతో మెయిన్ సెంటర్స్ లో అభిమానులు సందడి చేయడం చూసి బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో షాక్ కు గురయ్యారు. ఎందుకంటే హ్యాపీ మన దగ్గరే యావరేజ్ గా ఆడిన సినిమా. పెద్ద ఎత్తున నెలకొన్న అంచనాలు అందుకోలేకపోయింది. అయినా కూడా కామెడీ, బన్నీ జెనీలియా కెమిస్ట్రీ, యువన్ శంకర్ రాజా సంగీతం దాన్ని డీసెంట్ ఎంటర్ టైనర్ గా మార్చాయి.

సుమారు ఇరవై ఏడు లక్షల దాకా మొదటిరోజు హ్యాపీ వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్. ఇది పెద్ద మొత్తమే. ఎందుకంటే ఇరవై సంవత్సరాల వెనుకటి పాత సినిమా అది కూడా అంతంత మాత్రంగా ఆడిన ఒరిజినల్ వెర్షన్ దృష్ట్యా ఈ స్థాయి స్పందన అనూహ్యమని చెప్పాలి. దీని దెబ్బకు దేశముదురు, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి లాంటి వాటిని మళ్ళీ విడుదల చేసేందుకు కేరళ డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారట. బన్నీకి ఆర్య నుంచే అక్కడ మార్కెట్ ఏర్పడటం విశేషం.

This post was last modified on June 13, 2026 9:06 am

Share

Recent Posts

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

1 minute ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

39 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

2 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

2 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

4 hours ago