తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు తక్కువ అని… కొత్త కథలు ప్రయత్నించరని.. ఎప్పుడూ మాస్ మంత్రమే పఠిస్తుంటారని.. కథలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతుంటాయని.. ఒక వర్గం ప్రేక్షకులు ఫిర్యాదులు చేస్తుంటారు. మలయాళంలోనో, మరో భాషలోనో వినూత్నమైన కథలతో సినిమాలు వస్తే వాటిని కొనియాడుతూ మన సినిమాల దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
ఐతే ఇలా బాధ పడే ప్రేక్షకులు.. మన దగ్గర మంచి సినిమాలు వచ్చినపుడు కూడా ఆదరించి తమ అభిరుచిని చాటుకోవాల్సిన అవసరముంది. అప్పుడే మన దగ్గర తరచుగా కొత్త కథలు వస్తాయి. ప్రయోగాలు జరుగుతాయి.
ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. తెలుగులో తాజాగా సింగ్ గీతం అనే వినూత్నమైన సినిమా వచ్చింది. ఇది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన మూవీ. 94 ఏళ్ల వయసులో ఆయనీ సినిమా తీయడం విశేషం. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ టీం.. డబ్బులతో పాటు ఎంతో శ్రమను కూడా వెచ్చించి ఈ సినిమాకు దృశ్యరూపాన్ని ఇచ్చింది. సింగీతం ఎప్పుడో 40 ఏళ్ల కిందట అనుకున్న ఆలోచనను ఇప్పుడు డెవలప్ చేసి, ఏమాత్రం రాజీ లేని ప్రొడక్షన్‌తో సినిమా తీసిన నాగి అండ్ టీం కమిట్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
సింగీతం ఒకప్పుడు గొప్ప సినిమాలు తీశారు కాబట్టి.. ఇప్పుడు కేవలం ఆయన మీద గౌరవంతో ఈ సినిమా చూడాల్సిన అవసరమేమీ లేదు. తాను ఇంకా యంగ్ ఫిలిం మేకర్‌నే అని ఈ సినిమా కాన్సెప్ట్‌తోనే చాటిచెప్పారు సింగీతం.
ఒక శాపం వల్ల ఊరిలో జనాల మాటలు పాటలుగా మారిపోయే వినూత్నమైన కాన్సెప్ట్‌కు తోడు.. ఇందులో గొప్ప సందేశం ఉంది. సందేశాన్ని వినోదాత్మకంగా చెబుతూ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చారు సింగీతం అండ్ టీం. సింగ్‌గీతం సినిమాకు వెళ్లిన ఎవ్వరైనా ఇలాంటి సినిమా ఇంతకుముందెన్నడూ చూడలేదని కచ్చితంగా చెబుతారు.
ప్రతి సన్నివేశం.. ప్రతి డైలాగ్ కొత్తగా ఉంటుంది. మాటలనే పాటలుగా మార్చి ఈ కథను నరేట్ చేసిన తీరు గమ్మత్తుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టినా.. మరి కొన్ని ప్రతికూలతలు ఉన్నా సరే.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎంతమాత్రం రిగ్రెట్ కారు. మరి మంచి టాక్, రివ్యూలు తెచ్చుకున్న సింగ్ గీతంను అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఎంతమేర ఆదరించి బాక్సాఫీస్ దగ్గర దానికి పట్టం కడతారో చూడాలి.
This post was last modified on June 13, 2026 6:29 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…