Movie News

‘శాకుంతలం’లో సమంత.. ఒక ఆసక్తికర చర్చ

మొత్తానికి సస్పెన్స్ వీడిపోయింది. ‘రుద్రమదేవి’ తర్వాత సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తీయబోయే ‘శాకుంతలం’లో లీడ్ రోల్ చేయబోయేది సమంత అని తేలిపోయింది. ఈ పాత్రకు ముందు ప్రధానంగా వినిపించిన పేరు.. పూజా హెగ్డేదే. శకుంతల పాత్ర అంటే ఒక అందాల రాశి అయ్యుండాలి. అలాగే ఆ కథానాయికలో ఒక గ్రేస్ ఉండాలి. మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ అయితే సినిమాకు క్రేజ్ వస్తుంది.

వీటిని దృష్టిలో ఉంచుకుని పూజా హెగ్డేను ఈ పాత్రకు తీసుకుందామని గుణశేఖర్ గట్టి ప్రయత్నమే చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ మాంచి డిమాండ్లో ఉన్న పూజా.. ఈ దశలో ఇలాంటి రిస్కీ ప్రాజెక్టు ఎందుకని ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి. పూజా కాదన్న పాత్రను సమంత ఓకే చేసింది అనగానే ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఆ మధ్య సమంత సినిమా ‘మజిలీ’ టీవీలో చూస్తూ.. ఒక ఫొటో తీసి, సమంతనుద్దేశించి ‘ఈమె అందంగా ఉందా’ అని పూజా ప్రశ్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాని మీద సమంత, అక్కినేని అభిమానులు ఫైర్ అయిపోయారు. ఐతే తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది పూజా. కానీ ఆమె కావాలనే ఇలా చేసిందనే అనుమానాలు సమంత అభిమానుల్లో ఉన్నాయి. సమంతను కూడా ఈ వ్యాఖ్య హర్ట్ చేసే ఉండొచ్చన్న సందేహాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పూజా వద్దన్న పాత్రను సమంత ఓకే చేసిందనేసరికి.. దీనిపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. పూజా మీద నిజంగా సమంతకు కోపం ఉందా.. ఆ నేపథ్యంలోనే కసితో ఈ సినిమా ఒప్పుకుందా.. గుణశేఖర్ కూడా కావాలనే సమంతను సంప్రదించాడా అనే చర్చ నడుస్తోంది. ఆ సంగతలా వదిలేస్తే.. రొమాంటిక్ టచ్ ఉన్న ‘శాకుంతలం’ సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరం. ఇక సమంత ఈ పాత్ర డిమాండ్ చేసేంత గ్లామరస్‌గా కనిపించగలదా అన్నది సందేహం.

This post was last modified on January 3, 2021 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago