SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బృంద రవిందర్ దర్శకత్వంలో E. మోహన్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే..నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి బ్లాక్ n వైట్
టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను త్వరలోనే విడుదలచేయనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా..
దర్శకుడు బృంద రవిందర్ మాట్లాడుతూ – న్యూ ఇయర్ రోజున మా మూవీ టైటిల్ `బ్లాక్ n వైట్`ను అనౌన్స్ చేయడం హ్యాపీగా ఉంది. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ ని విడుదల చేస్తాం
అన్నారు.
నిర్మాత E. మోహన్ మాట్లాడుతూ – బ్లాక్ n వైట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియన్స్‌ని తప్పకుండా థ్రిల్ చేస్తుంది
అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ – బ్లాక్ n వైట్' టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటిస్తాం
అన్నారు.
ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: ఈశ్వర్ ఎల్లుమహంతి,
సంగీతం: మణిశర్మ,
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు,
లిరిక్స్: అనంత్ శ్రీరామ్,
అడిషనల్ డైలాగ్స్: విజయ భారతి,
స్క్రిప్ట్ అసిస్టెన్స్: బి. వసుదేవ రెడ్డి,
పబ్లిసిటి డిజైనర్: అనిల్- భాను,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్,
నిర్మాత: E. మోహన్,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బృంద రవిందర్.
This post was last modified on January 3, 2021 2:16 pm
నిన్న ‘పుష్ప-2’ సక్సెస్ మీట్లో చాలామంది ప్రసంగాలు చేశారు. అందులో సుకుమార్ స్పీచే హైలైట్‌గా నిలిచింది. ఎవరో పెద్దగాయన్న అన్నారంటూ…
శనివారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. జనసేనకు చెందిన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్.. నగరానికి చెందిన…
జూన్ ఒకటి నుంచి మల్లువుడ్ బంద్ కాబోతోంది. కేరళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నారు.…
తండేల్ ప్రాజెక్ట్ లాకైనప్పుడు సంగీత దర్శకుడిగా ముందు దేవిశ్రీ ప్రసాద్ తమ ఆప్షన్ గా లేడని నిర్మాత అల్లు అరవింద్…
వైస్సార్సీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని శనివారం న్యూటన్ థియరీతో ఓ రేంజిలో ఫైర్ అయిపోయిన సంగతి…
జనవరిలో సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ 300 కోట్ల ఇండస్ట్రీ హిట్ సాధించడం అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సహాన్ని ఇచ్చింది. సీనియర్ స్టార్లలో…