Movie News

లెనిన్ ప్రేమలో ఇంత వయొలెన్స్ ఉందా

దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. ఎలాంటి జానర్ తీసుకున్నా ఆశించిన ఫలితం దక్కక అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. ముఖ్యంగా ఏజెంట్ చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ లెనిన్ మీద ఉన్నాయి. ఈసారి నాగార్జున స్వయంగా నిర్మాణ భాగస్వామిగా మారడంతో పాటు ప్రాజెక్టు వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. సితార సంస్థ మెయిన్ పార్ట్ నర్.

ఇదంతా అలా ఉంచితే లెనిన్ లో ఇంతకీ ఏముందనే క్లారిటీ ఇప్పటిదాకా సరిగా లేదు. అఖిల్ గెటప్ గట్రా చూసి విలేజ్ బ్యాక్ డ్రాప్ అనే క్లారిటీ వచ్చేసింది కానీ ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయనే విషయాన్ని గోప్యంగా దాచారు. దానికి కొంత సమాధానం ఇస్తూ ఇవాళ సోల్ అఫ్ లెనిన్ పేరుతో కొత్త వీడియో సాంగ్ విడుదల చేశారు. భాగ్యశ్రీ బోర్సేని హైలైట్ చేస్తూ రూపొందించిన ఈ సాంగ్ లో అఖిల్ ఎన్నడూ లేనంత వయొలెంట్ గా కనిపిస్తున్నాడు.

అంతర్లీనంగా లెనిన్ చెబుతోంది ఒకటే. ఇదో లవ్ స్టోరీ. ప్రేమ కన్నా హింసాత్మకమైనది ప్రపంచంలో మరొకటి లేదనే తరహాలో దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు మంచి మాస్ ఎలిమెంట్స్ తో దీన్ని దట్టించినట్టు అర్థమవుతోంది. దానికి తగ్గట్టు తమన్ సంగీతం కూడా తోడవ్వడంతో అంచనాలు పెరిగేలా ఉన్నాయి. అంటే ప్రియురాలి కోసం కత్తి పట్టుకుని ఎంతకైనా తెగించే పక్కా విలేజ్ బాయ్ గా అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించబోయేది నిజం.

జూన్ 26 విడుదల కాబోతున్న అఖిల్ కు బాక్సాఫీస్ దగ్గర మంచి అవకాశం ఉంది. పెద్ది అప్పటికంతా ఫైనల్ రన్ కు దగ్గరగా ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ అనుకోవడానికి లేదు. వారం ముందు వచ్చే మా ఇంటి బంగారం, దీవానా, వంద దేవుళ్ళు మొదలైనవి లెనిన్ స్కేల్ తో పోల్చుకునేవి కాదు కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు లెనిన్ ఈజీగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లొచ్చు. ఎన్నడూ లేనంత గ్రాండ్ గా అఖిల్ కి స్వాగతం చెప్పడానికి ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్.

This post was last modified on June 5, 2026 5:44 pm

Share

Recent Posts

సంక్రాంతి థియేటర్ల కోసం యుద్ధాలు చేయాలేమో

ఇంకా నాలుగు నెలలు ఉండగానే 2027 సంక్రాంతి గురించి ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి. నేనంటే నేనంటూ…

15 minutes ago

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

1 hour ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

2 hours ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

2 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

4 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

4 hours ago