Movie News

మొదటి కుస్తీలో ‘పెద్ది’కి వంద పాయింట్లు

తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్ డే కోసం రెడీ అవుతోంది. ఓవర్సీస్ లో 2.5 మిలియన్ మార్కు క్రాస్ చేసి అక్కడా తన ముద్ర వేసేందుకు పరుగులు పెడుతోంది. ఇది యూనిట్ అధికారికంగా ప్రకటించిన నెంబర్. ఒకవేళ క్షేత్ర స్థాయిలో కాస్త హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కాని ఓవరాల్ గా చూసుకుంటే రామ్ చరణ్ బెస్ట్ నెంబర్లు నమోదు కావడం పట్ల ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.

అసలు సవాల్ ఇకపై ఉంది. పెద్దికి మిక్స్డ్ టాక్ లేకపోలేదు. కొన్ని వర్గాలకు విపరీతంగా నచ్చేయగా నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే పబ్లిక్ టాక్ యావరేజ్ నుంచి బ్లాక్ బస్టర్ మధ్యలో ఊగుతోంది. ఒకవేళ టాక్ లైట్ తీసుకుని జనం కనక పెద్దిని చూడాలని ఫిక్స్ అయితే ఆల్ టైం రికార్డు అంకెలు నమోదు కావడం ఖాయం. ఇటీవలే వీరభద్రుడు, దృశ్యం 3 లాంటి సోసో టాక్ తెచ్చుకున్న డబ్బింగ్ సినిమాలే తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెవిన్యూ సాధించుకున్నాయి.

అలాంటిది పెద్దికి భారీ వసూళ్లు రావడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఆరు వందల రూపాయలు ప్రీమియర్ షో టికెట్ రేట్ పెట్టినా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్, కుటుంబాలు వాటికి రావడం గమనార్హం. ఈ రోజు హోల్డ్ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో కరెంట్ బుకింగ్స్ బాగున్నాయని, అయితే పది రోజుల పెంపుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం వల్ల సోమవారం నుంచి ఎంత డ్రాప్ ఉంటుందనేది అంతు చిక్కడం లేదు.

పెద్దికి ప్రధానాంగా కలిసి వస్తున్న పాయింట్ లాంగ్ వీకెండ్. బుధవారమే ప్రీమియర్లు వేయడంతో ఆదివారం వచ్చేనాటికి నాలుగో రోజు అవుతుంది. ఆక్యుపెన్సీలు పెద్ద ఎత్తున ఉంటాయి. సో ఈ అవకాశాన్ని పెద్ది కనక క్యాష్ చేసుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేసుకోవచ్చు. అయితే అదంత సులభం కాదు. టాక్ మరింత పెరగాలి. మిక్స్డ్ నుంచి యునానిమస్ గా మారాలి. పెద్ది బృందం ఆ నమ్మకంతోనే ఉంది. సక్సెస్ మీట్ చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది.

This post was last modified on June 5, 2026 11:41 am

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

7 hours ago