స్థానిక ఎన్నికల్లో పరాజయం తర్వాత.. వైసీపీలో మరింతగా సహాయ నిరాకరణ పెరిగిందా? నాయకుల తీరు మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు, వివిధ మీడియా కథనాల ప్రకారం ఈ అంశానికి సంబంధించిన వ్యవహారంపై పార్టీ అధినేత జగన్ అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాత.. కూడా నాయకుల పనితీరును ఆయన అంచనా వేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా జగన్ వైఖరిని చాలా మంది నాయకులు తప్పుబడుతున్నారని అంటున్నారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా దూరంగా ఉండటాన్ని సొంత పార్టీ నేతలు ప్రజాతీర్పును అవమానించడంగా విమర్శిస్తున్నారు. ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించాల్సిన బాధ్యతను విస్మరించి సహాయ నిరాకరణ చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. అదేసమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడానికి బదులు, ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీనియర్లు పరోక్షంగా ఆరోపిస్తున్నారు.
పార్టీలో అంతర్గత అసమ్మతి పెరిగిపోయింది. పలు నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం, ఇన్‌ఛార్జ్‌ల వ్యవహా రశైలిపై సొంత పార్టీ కార్యకర్తలే సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నారని, దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడుతోందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ జనసేనలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలోనూ వైసీపీ విఫలమైందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నా రు. ప్రభుత్వ వైఫల్యాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉద్యోగుల సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై తాము క్షేత్రస్థాయిలోనే పోరాడలేక పోవడానికి కేడర్‌లో అసంతృప్తే కారణమని బుగ్గన వంటి వారు పేర్కొనడం దీనికి ఉదాహరణ. ఇదేసమయంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న వాదనలో పసలేదని అనే వారు కూడా కనిపిస్తుండడం గమనార్హం.
మొత్తంమీద, ఒకవైపు పార్టీ అధినేత చెబుతున్న సూచనలకు, మార్గదర్శకాలకు సహకరించకుండా వైసీపీ నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే.. ఒక కీలక నాయకుడి వైఖరి కారణంగానే ఇదంతా జరుగుతోందన్న వాదన ఉంది. ఇటీవల బడ్డుకొండ అప్పలనాయుడు బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయడం.. అనంతరం.. పలు జిల్లాల్లో నాయకులు మౌనంగా ఉండడం.. తాజాగా పలువురు నాయకులు పార్టీ మారేందుకు రంగం రెడీ చేసుకోవడం వంటివి వైసీపీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.
This post was last modified on November 14, 2026 4:59 pm
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.…
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా అంటే వాతావరణం అలాగే కనిపిస్తుంది. ఇప్పటి…
చెప్పిన డేటుకి షూటింగ్ పూర్తి చేయరు. రిలీజ్ డేట్ మళ్లీ మళ్లీ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్ డేట్ దగ్గర…
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషుల జీవితాలు సులభతరం కావాలి. కానీ కొన్ని సంస్థల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.…
దేశంలో మొదటిసారి హైదరాబాద్ లో శనివారం గిగ్ వర్కర్ల సంక్షేమ సభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ…
హిందూ సంస్కృతి, పురాణాలు, దేవుళ్ల నేపథ్యంలో సినిమాలు తీస్తే తమిళ ప్రేక్షకులకు పెద్దగా పట్టదు అనే ఒక ముద్ర పడిపోయింది.…