Movie News

నాగ్ చెప్ప‌డం కాదు… చేసి చూపిస్తున్నాడు

చెప్పిన డేటుకి షూటింగ్ పూర్తి చేయ‌రు. రిలీజ్ డేట్ మళ్లీ మ‌ళ్లీ మార్చాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఫైన‌ల్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌గా హ‌డావుడి ప‌డ‌తారు. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డామంటారు. స‌మ‌యానికి ఫ‌స్ట్ కాపీ రెడీ అవ్వ‌దు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ హ‌డావుడి అవుతుంది. సెన్సార్ ద‌గ్గ‌ర లేట‌వుతుంది. ఓవ‌ర్సీస్‌కు స‌మ‌యానికి ప్రింట్లు అంద‌వు. తీరా చూస్తే ఔట్ పుట్ అంతంత‌మాత్రంగా ఉంటుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన ఫ‌లితం రాదు.

ఈ మ‌ధ్య కాస్త పేరున్న ప్ర‌తి సినిమాకూ ఇదే ప‌రిస్థితి త‌లెత్తుతోంది. దీనిమీద చాలామంది సినీ పెద్ద‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. అయినా ప‌రిస్థితి మార‌డం లేదు. కొన్ని నెల‌ల ముందు లెనిన్ సినిమా ఈవెంట్లో సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత అక్కినేని నాగార్జున ఈ విష‌యం మీద కొంచెం గ‌ట్టిగానే మాట్లాడాడు. పాత రోజుల్లో నెల రోజుల ముందు ఫ‌స్ట్ కాపీ రెడీగా పెట్టుకునేవాళ్ల‌మ‌ని చెబుతూ.. ద‌ర్శ‌కులు మారాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

ఐతే మిగ‌తా వాళ్ల‌కు చెప్పి, తాను ఈ సూత్రాల‌ను పాటించ‌కుంటే బాగుండ‌దు క‌దా. అందుకే త‌న వందో సినిమా కింగ్ 100 విష‌యంలో ప్లాన్ ప్ర‌కారం అడుగులు వేస్తున్న విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇట్లు అర్జున స‌క్సెస్ మీట్లో నాగ్.. త‌న సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. కింగ్ 100 డిసెంబ‌రు 24న క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల చివ‌రికి ఒక పాట మిన‌హా పూర్త‌యిపోతుంద‌ని నాగ్ తెలిపారు.

విడుద‌ల‌కు కొన్ని వారాల ముందే ఫ‌స్ట్ కాపీ రెడీ అయిపోతుంద‌ని కింగ్ స్ప‌ష్టం చేశాడు. స‌మ‌యానికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కు టైం ఉంటే.. 75 శాతం సినిమాను 150 శాతానికి తీసుకెళ్ల‌వ‌చ్చంటూ మ‌రోసారి ద‌ర్శ‌కులకు ఆయ‌న హిత‌వు ప‌లికారు.

చివ‌ర్లో హ‌డావుడి వ‌ల్ల ఏఐతో ప‌ని పూర్తి చేస్తున్నామ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని.. ఆ ప‌రిస్థితి రాకుండా ప్లాన్ ప్ర‌కారం ప‌ని చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కు త‌గిన స‌మ‌యం ఉండేలా చూడాల‌ని నాగ్ సూచించారు. త‌మిళ ద‌ర్శ‌కుడు రా.కార్తీక్ రూపొందిస్తున్న కింగ్ 100లో ట‌బు కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త‌మ సొంత బేన‌ర్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నాగ్ స్వ‌యంగా నిర్మిస్తున్నాడు.

This post was last modified on November 15, 2026 1:09 am

Share

Recent Posts

వాష్‌ రూమ్‌ విషయంలోనూ ఏఐ గోల తప్పట్లేదు

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషుల జీవితాలు సులభతరం కావాలి. కానీ కొన్ని సంస్థల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.…

4 hours ago

‘రాహుల్ వెనుక మేము పరిగెడితే వారికెందుకు బాధ’

దేశంలో మొదటిసారి హైదరాబాద్ లో శనివారం గిగ్ వర్కర్ల సంక్షేమ సభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ…

5 hours ago

తమిళ బాక్సాఫీస్ దగ్గర విడ్డూరం

హిందూ సంస్కృతి, పురాణాలు, దేవుళ్ల నేపథ్యంలో సినిమాలు తీస్తే తమిళ ప్రేక్షకులకు పెద్దగా పట్టదు అనే ఒక ముద్ర పడిపోయింది.…

7 hours ago

ఊహించని కాంబో… ఎన్టీఆర్ & రావిపూడి

ఎవరూ ఊహించని కాంబినేషన్ తెరకెక్కనుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్నట్టు తారక్ స్వయంగా…

8 hours ago

బహుముఖ ప్రజ్ఞాశాలి ‘గిరిబాబు’ ఇక లేరు

టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అయిదు దశాబ్దాలకు పైగా కళారంగానికి ఎన్నో సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు…

8 hours ago

ఇకపై మీ పిల్లలను మీరే కనాలి

సంతానం కలగడం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత కల. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడంతో పిల్లలు లేని దంపతులకు ఎన్నో మార్గాలు…

9 hours ago