టాలీవుడ్లో అడుగు పెట్టే యువ కథానాయకులు చాలామందికి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఆయన్ని కలిసే అవకాశం వచ్చినా.. తమ గురించి ఒక మంచి మాట మాట్లాడినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోతుంటారు. ఈ మధ్య ఇలాగే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకు యువ నటుడు సత్యదేవ్ ఎంత పరవశించిపోయాడో తెలిసిందే. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో నటనకు గాను చిరు నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. చిరుతో కలిసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చాలా ఎగ్జైటెడ్‌గా మాట్లాడిన సత్యదేవ్.. 2020 ముగింపు సందర్భంగా తన మధుర జ్ఞాపకంగా చిరును కలిసినప్పటి ఫొటోనే సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఐతే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకే ఇంత ఆనందించిన సత్యదేవ్.. చిరుతో కలిసి నటించే అవకాశం వస్తే ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం.
ఆ అరుదైన అవకాశం సత్యదేవ్ తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ‘ఆచార్య’ తర్వాత చిరు చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్‌లో సత్యదేవ్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడట. అతను చేయబోయే పాత్ర ఏంటన్నది స్పష్టత లేదు. కానీ అతను మాత్రం ‘లూసిఫర్’ రీమేక్‌లో ఉన్నాడట. బహుశా ఒరిజినల్లో టొవినో థామస్ చేసిన పాత్రకు సత్యదేవ్ ఎంపికై ఉంటాడేమో. సినిమాలో లేటుగా రంగప్రవేశం చేసే పాత్ర.. ద్వితీయార్ధంలో కీలకంగా ఉంటుంది. ఈ పాత్రనే సత్యదేవ్ చేసేట్లయితే అతడికి మంచి గుర్తింపే రావచ్చు. మరి ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ చేసిన విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా ‘లూసిఫర్’ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలన్న ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నారు. సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌తో కలిసి రామ్ చరణే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
This post was last modified on January 2, 2021 11:24 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…