సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని కేసు బ్లాక్ బక్ పౌచింగ్. 1998లో హం సాత్ సాత్ హై షూటింగ్ రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ ప్రాంతంలో జరిగింది. అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో సల్మాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బెంద్రే తదితరులు అక్కడి అడవిలోని అరుదైన రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే అభియోగం నమోదయ్యింది. స్థానికంగా ఉండే బిష్ణోయ్ వర్గం ఈ జింకలను పవిత్రంగా పూజిస్తారు. దీంతో పోలీస్ కేసు నమోదై బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
20 సంవత్సరాల పాటు దీని విచారణ జరిగింది. 2018లో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ని దోషిగా నిర్ధారిస్తూ అయిదు సంవత్సరాల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. మిగిలిన వాళ్ళు నిర్దోషులుగా బయట పడ్డారు. ఏప్రిల్ నెలలో రెండు రోజులు జైల్లో ఉన్న సల్మాన్ ఖాన్ తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు. 2022లో ఇది రాజస్థాన్ హైకోర్టు అప్పీల్ కు వెళ్ళింది. ఇంకా విచారణ పూర్తి కాలేదు. దశాబ్దాల తరబడి కొనసాగుతూనే వస్తోంది.
ఇప్పుడీ ఘటనను ఆధారంగా చేసుకుని కాలా హిరణ్ అనే సినిమా నిర్మాణంలో ఉంది. అమిత్ జానీ నిర్మాణంలో భరత్ దర్శకత్వంలో రూపొందించారు. పెద్దగా పేరు లేని క్యాస్టింగ్ ఇందులో నటించారు. పోస్టర్లు ఇతరత్రా ప్రమోషనల్ మెటీరియల్ తన బ్లాక్ బక్ పౌచింగ్ ని పోలి ఉండటంతో సల్మాన్ సదరు దర్శక నిర్మాతలకు ఏప్రిల్ లోనే లీగల్ నోటీసులు పంపారు. ఇంకా హియరింగ్ లోనే ఉన్న కేసు మీద సినిమా ఎలా తీస్తారనేది ఆయన అభ్యంతరం.
అయితే ప్రొడ్యూసర్ మాత్రం తాము సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించి తీయలేదని, కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించామని అంటున్నారు. వెనుకడుగు వేసే ఉద్దేశంలో లేమని చెబుతున్నారు. జూన్ 20 విడుదలకు రెడీ అవుతున్న కాలా హరన్ చెప్పిన టైంకి థియేటర్లకు వస్తుందా లేక కోర్టు ప్రమేయంతో బ్రేక్ వేసుకుంటుందా అనేది వేచి చూడాలి. అయినా సల్మాన్ కేసు మీద ఇంత ధైర్యంగా సినిమా తీయడం చూస్తే నిర్మాతలో మంచి బిజినెస్ యాంగిల్ కనిపిస్తోంది.
This post was last modified on June 2, 2026 7:44 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…