‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది తెలుగు పాటే కానీ.. దేశవ్యాప్తంగా ఇది సూపర్ పాపులర్ అయింది. ఇంకా చెప్పాలంటే దేశం అవతల, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ పాటకు ఆదరణ దక్కింది. ఈ పాటను తలుచుకోగానే.. అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా గుర్తుకు వస్తాడంటే అతిశయోక్తి కాదు. ఆ పాటకు వార్నర్ తన భార్యా పిల్లలతో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత వార్నర్‌కే చెందుతుంది. ఈ పాటకు వార్నర్ తెచ్చిన పాపులారిటీ గురించి అల్లు అర్జున్ సైతం మాట్లాడటం విశేషం.
సమంత నిర్వహించే ‘సామ్ జామ్’ షోకు బన్నీ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇందులో ఒకచోట బుట్టబొమ్మ పాట ప్రస్తావన రాగా.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం గురించి బన్నీ చెబుతూ.. ఈ పాటను సగం పాపులర్ చేసింది డేవిడ్ వార్నరే అన్నాడు. ఇటీవల భారత్‌తో సిరీస్ సందర్భంగా మ్యాచ్ మధ్యలో కూడా వార్నర్ బుట్టబొమ్మ స్టెప్ వేసి స్టేడియంలో ఉన్న జనాలను అలరించాడు. ఈ విషయాన్ని కూడా బన్నీ ప్రస్తావించాడు. వార్నర్‌తో పాటు ఆయన భార్యా పిల్లలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఈ పాటకు మరింత పాపులారిటీ తెచ్చారని బన్నీ అన్నాడు. ‘బుట్ట బొమ్మ’ హిట్టవుతుందనుకున్నాం కానీ.. ఈ స్థాయిలో ఆదరణ పొందుతుందని తాము ఊహించలేదని బన్నీ చెప్పాడు. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 50 కోట్ల వ్యూస్ మార్కుకు చేరువగా ఉండటం విశేషం. 32 లక్షలకు పైగా దానికి లైక్స్ వచ్చాయి ఇప్పటిదాకా.
This post was last modified on January 2, 2021 8:27 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…