బ్రహ్మానందం ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఎక్కడున్నాడు.. ఆయన సినిమాల్లో కనిపించడమే అరుదైపోయింది కదా.. ఆయన దాదాపు రిటైరైపోయారు కదా అంటారా? కానీ బ్రహ్మి ఇప్పుడు సినిమాలు చేస్తుండకపోవచ్చు.. నటుడిగా బిజీగా లేకపోవచ్చు కానీ.. చిత్రకారుడిగా మాత్రం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే తన చిత్ర కళా నైపుణ్యాన్ని చూపిస్తూ ఆయన గీసిన కళాఖండాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు బ్రహ్మి వాటన్నింటినీ తలదన్నే ఆర్ట్ గీశారు. శ్రీ వేంకటేశ్వరుడికి ఒక పూజారి ధూప నైవేద్యం సమర్పిస్తున్న దృశ్యానికి ఆయనలోని చిత్రకారుడు రూపం ఇచ్చాడు. హ్యాండ్ పెన్సిల్‌తో ఆయన ఈ ఆర్ట్ వేయడం విశేషం. దీని కోసం ఏకంగా 45 రోజుల పాటు పని చేశారట బ్రహ్మానందం. నూతన సంవత్సర కానుకగా ఇండస్ట్రీ ప్రముఖులకు తనదైన ప్రత్యేక కానుక ఇవ్వాలని బ్రహ్మానందం నిర్ణయించుకుని రెండు నెలల ముందే ఈ పని మొదలుపెట్టారట.
సొంతంగా పెన్సిల్ ఆర్ట్ గీసి.. దాన్ని ఫ్రేమ్ చేయించడంతో పాటు ఆ బొమ్మతో క్యాలెండర్ కూడా రూపొందించి… ఈ రెండు బహుమతులకు ఇండస్ట్రీలో తనకు ఆత్మీయులైన అందరికీ పంపించారు బ్రహ్మానందం. ఈ రెండు బహుమతులు అందుకున్న అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్.. ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఇది అత్యంత విలువైన బహుమతి అని.. బ్రహ్మానందం 45 రోజుల పాటు దీని మీద పని చేశారని బన్నీ వెల్లడించాడు. మిగతా సినీ ప్రముఖులకు కూడా బ్రహ్మి ఈ బహుమతుల్ని పంపినట్లు తెలుస్తోంది.
బ్రహ్మిలో ఇంత గొప్ప చిత్రకారుడున్న సంగతి కొన్నేళ్ల ముందు వరకు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన తన నైపుణ్యాన్ని చూపించడానికి సమయం లేదప్పుడు. పాతికేళ్లకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ వన్ కమెడియన్‌గా ఆధిపత్యాన్ని చాటిన బ్రహ్మి.. కొన్నేళ్ల నుంచే ఖాళీగా ఉంటున్నారు. ఈ సమయంలో తన చిత్రకళను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు.
This post was last modified on January 1, 2021 7:38 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…