Movie News

దండుకుంటున్న రాజు గారు

ఈ మధ్య ‘డర్టీ హరి’ సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ట్విట్టర్లో దాని దర్శకుడు ఎం.ఎస్.రాజును ఉద్దేశించి ఒక పోస్టు పెట్టాడు. ఎం.ఎస్.రాజు సినిమాలన్నా, ఆయనన్నా చాలా ఇష్టం గౌరవం ఉండేవని.. సినిమాలు తీయడంలో ఆయన స్టాండర్డ్సే వేరని.. కానీ ‘డర్టీ హరి’ లాంటి సినిమాలు మాత్రం తీయకండని ఈ పోస్టులో పేర్కొన్నాడు. దానికి ఎం.ఎస్.రాజు ఏమాత్రం తడుముకోకుండా.. ‘‘సుత్తి సినిమాలు చెయ్యాలా ఇంకా.. ఎవరినో మెప్పించడానికి నేను సినిమాలు చెయ్యను’’ అంటూ కుండబద్దలు కొట్టేశారు.

తాను తీసిన సినిమా విషయంలో రాజు ఎంత కన్విక్షన్‌తో ఉన్నారనడానికి ఈ కామెంట్ రుజువు. ‘డర్టీ హరి’ విషయంలో విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. యువతను ఈ సినిమా బాగానే ఆకట్టుకోవడంతో ఆయన ఇకపైనా ఇలాంటి బోల్డ్ సినిమాలే తీయాలని ఫిక్సయినట్లున్నారు. ‘డర్టీ హరి’ రాజు అంచనాల్ని మించి విజయం సాధించిందన్నది ట్రేడ్ వర్గాల మాట.

ఈ సినిమాను ఆయన ప్రమోట్ చేసిన తీరు.. విడుదలకు ఎంచుకున్న మార్గాలు.. అన్నీ ఆయన పనైపోలేదని చాటి చెబుతాయి. ముందుగా పే పర్ వ్యూ పద్ధతిలో ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త యాప్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు రాజు. ఇందులోని బోల్డ్ కంటెంట్ యూత్‌ను బాగానే ఆకట్టుకోవడంతో రిలీజ్ రోజు మాంచి డిమాండే కనిపించింది. 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. రూ.120 టికెట్ రేటుతో సినిమాను స్ట్రీమ్ చేశారు. అలా తొలి రోజే కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.

ఇలా ఓ వారం రోజులు నడిపించి.. ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీకి సినిమాను అమ్మారు. ఇప్పుడు ఆ ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు సినిమా చూస్తున్నారు. ఈ రెండు మార్గాల్లోనూ రాజు మంచి ఆదాయం పొందిన రాజు, ఇంతటితో ఆగకుండా ‘డర్టీ హరి’ని థియేట్రికల్ రిలీజ్‌కు కూడా రెడీ చేస్తుండటం విశేషం. జనవరి 8న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి కొత్త సినిమాలు దిగుతున్న నేపథ్యంలో ఒక వారం పాటు సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకుని అదనపు ఆదాయం పొందడానికి రాజు మంచి ప్లానే వేశారన్నమాట.

This post was last modified on January 1, 2021 10:02 am

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

5 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

24 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

57 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago