Movie News

శివ‌న్న‌కు పునీత్‌ను గుర్తు చేసిన పవన్

క‌న్న‌డ లెజెండ‌రీ న‌టుడు రాజ్ కుమార్ త‌న‌యుడు శివ‌రాజ్ కుమార్‌కు తెలుగులో త‌మ స‌మ‌కాలీనులైన హీరోలు, వారి కుటుంబాల‌తో ఎంత మంచి అనుబంధం ఉందో తెలిసిందే. ముఖ్యంగా మెగా, నంద‌మూరి కుటుంబాల‌తో ఆయ‌న ఎంతో స‌న్నిహితంగా మెలుగుతుంటారు. మెగా ఫ్యామిలీలో చిరు, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వీళ్లంద‌రి మీదా శివ‌న్న వ‌ల్ల‌మాలిన అభిమానం చూపిస్తుంటాడు.

చ‌ర‌ణ్ మీద అభిమానంతోనే అత‌డి కొత్త సినిమా పెద్దిలో గౌర్నాయుడు పాత్ర‌లో న‌టించాడు శివ‌న్న‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా తాజాగా పెద్ది టీం బెంగ‌ళూరులో ఒక ఈవెంట్ చేసింది. దీనికి చ‌ర‌ణ్‌, జాన్వి, శివ‌న్న తదిత‌రులు హాజ‌ర‌య్యాడు.

ఈ వేడుక‌లో చ‌ర‌ణ్‌ను ప‌క్క‌న పెట్టుకుని స్టేజ్ మీద శివ‌న్న మాట్లాడిన మాట‌లు అంద‌రినీ క‌దిలించేశాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చ‌ర‌ణ్‌ల అనుబంధం గురించి మాట్లాడుతూ.. త‌న త‌మ్ముడు, దివంగ‌త పునీత్ రాజ్ కుమార్‌ను ఆయ‌న గుర్తు చేసుకుని ఎమోష‌న‌ల్ కావ‌డం ఎవరు ఊహించలేదు.

గ‌తంలో గేమ్ చేంజర్ సినిమా వేడుక‌లో ప‌వ‌న్, చ‌ర‌ణ్ ప‌క్క ప‌క్క‌న కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా బాబాయి ప‌ట్ల చ‌ర‌ణ్ చూపించిన గౌర‌వం.. త‌న అన్న కొడుకును ప‌వ‌న్ ప్రేమ‌గా చూసుకున్న వైనం.. స్టేజ్ పైకి పిలిచారని చ‌ర‌ణ్ లేవ‌బోతుంటే సెక్యూరిటీ చెప్పేవరకు ఇక్క‌డే కూర్చోమ‌ని ప‌వ‌న్ చేతితో వారించ‌డం.. ఇలా ఆ వీడియో చాలా ల‌వ్లీగా ఉంటుంది.

ఆ వీడియోను శివ‌న్న కూడా చూశాడ‌ట‌. అది ఆయ‌న‌కు ఎంతో న‌చ్చింద‌ట‌. ఆ విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఆ వీడియో చూసిన‌పుడు తన‌కు త‌న త‌మ్ముడు పునీత్ గుర్తుకొచ్చాడ‌ని.. త‌మ ఇద్ద‌రం కూడా అలాగే ఉండేవార‌మ‌ని శివ‌న్న చెప్ప‌గానే ఆడిటోరియం హోరెత్తింది. అంద‌రూ ఎమోష‌న‌ల్ అయిపోయారు.

ఇక పెద్ది అద్భుత‌మైన సినిమా అని, చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించ‌డం మంచి అనుభ‌వ‌మ‌ని చెప్పిన శివ‌న్న‌.. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని, రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా జాతీయ పుర‌స్కారం అందుకుంటాడ‌ని శివ‌న్న ధీమా వ్యక్తం చేశారు. తాను చేసిన గౌర్నాయుడు పాత్ర త‌న కెరీర్లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే క్యారెక్ట‌ర్ల‌లో ఒక‌ట‌ని ఆయ‌న‌న్నారు.

This post was last modified on May 25, 2026 6:12 pm

Share

Recent Posts

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

4 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

1 hour ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

2 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

2 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

3 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

4 hours ago