దశాబ్దంకు పైగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఆశలన్నీ లెనిన్ మీదే ఉన్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామా జూన్ 26 విడుదల కానుంది. ఒకటి రెండు హిట్లు ఉన్నప్పటికీ కెరీర్ పరంగా పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్న అఖిల్ కి ఇది చాలా పెద్ద పరీక్ష. దర్శకుడు మురళికిషోర్ అబ్బూరుకు అనుభవం తక్కువే అయినా కంటెంట్ మీద నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టారు.
ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లోని ఒక ఊరిలో లెనిన్ అనే కుర్రాడు. స్నేహితులతో జీవితం సరదాగా గడుపుతూ, తనకు తోచింది చేసుకుంటూ బాధ్యతగా ఉంటాడు. స్టేజి మీద నాటకాలు వేసే అమ్మాయిని ప్రేమిస్తాడు. అంతా బాగుందనుకున్న టైంలో లెనిన్ కత్తి పట్టాల్సి వస్తుంది. ఎవరి కోసమో లక్ష్యం పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. అదేంటో తెలియాలంటే ఇంకో నెల రోజులు ఆగాల్సిందే.
ఇప్పటిదాకా ట్రై చేయని స్లాంగ్ తో అఖిల్ కొత్తగా ఉన్నాడు. పల్లెటూరి యువకుడిగా గెడ్డం పెంచి మాస్ టచ్ తో అభిమానులను గట్టిగా సంతృప్తి పరచాలని డిసైడ్ అయ్యాడు కాబోలు. నటన పరంగా కూడా సన్నివేశాలు, డైలాగులు కొత్తగా ఉన్నాయి. అయితే స్టోరీ ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్త పడటంతో భాగ్యశ్రీ బోర్సే, అఖిల్ మీద ఎక్కువ కంటెంట్ చూపించి విలన్ తదితర అంశాలను రివీల్ చేయలేదు. అంటే అసలు మ్యాటర్ వేరే ఉందన్న మాట.
తమన్ సంగీతం సమకూరుస్తున్న లెనిన్ ఇకపై ప్రమోషన్ల స్పీడ్ పెంచనుంది. వ్యవధి తక్కువగా ఉండటంతో పబ్లిసిటీని కొత్తగా ప్లాన్ చేస్తారట. పెద్ది హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకో వారం పది రోజులు ఆగి ఆ తర్వాత గేరు మారుస్తారు. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు కూడా లెనిన్ హిట్ కావడం చాలా అవసరం. నిర్మాత నాగవంశీ ఫంకీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని లెనిన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి ఫలితం దక్కనుందో.
This post was last modified on May 23, 2026 12:58 pm
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…