Movie News

కింగ్ 100… ఒక కబురు చెప్పాల్సింది

ఈ రోజు అక్కినేని నాగార్జునకి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయన మొదటి సినిమా విక్రమ్ విడుదలయ్యింది. హిందీలో బ్లాక్ బస్టర్ సాధించిన జాకీ శ్రోఫ్ హీరోని వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంతో ఏఎన్ఆర్ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. సూపర్ హిట్ అయ్యింది. తొలి అడుగుకు మంచి మార్కులు పడ్డాయి. అక్కడి నుంచి నాగ్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి.

మరో విశేషం మనం రిలీజయ్యింది కూడా ఇదే రోజే. అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి మూవీగా అభిమానుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకుంది. ఇది కూడా స్వంత బ్యానర్ లోనే నాగార్జున నిర్మించడం కొడుకుగా తండ్రికిచ్చిన గొప్ప నివాళిగా చెప్పుకోవచ్చు. పైగా మూడు తరాల హీరోలు ఇందులో నటించడం ద్వారా ఇంకో ఘనత అందుకుంది. ఇన్ని ప్రత్యేకతలు మే 23కి ఉన్నాయి కానీ ఫ్యాన్స్ కోరుకున్నది మాత్రం మరొకటి ఉంది. అదే కింగ్ 100 అప్డేట్.

కోలీవుడ్ ఫేమ్ ఆర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న నాగార్జున వందో సినిమా షూటింగ్ హడావిడి లేకుండా జరుగుతోంది. దాదాపు సగానికి పైగా అయిపోయిందని యూనిట్ వర్గాల టాక్. నాగ్ చాలా చలాకీగా యంగ్ గా కనిపిస్తున్న ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఇంకా నిర్ధారణ చేయలేదు. 2027 సంక్రాంతికి బంగార్రాజు సీక్వెల్ ఉంటుందని చెబుతున్న తరుణంలో కింగ్ 100 ఈ సంవత్సరమే విడుదల కావాలి. కానీ డేట్ ఫిక్స్ కాలేదు.

ఏదైనా టీజర్ లేదా పోస్టర్ లాంటిది వదిలి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో చాలా గ్యాప్ తర్వాత టబు రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఆవిడ నాగార్జునతో కలిసి నటించిన నిన్నే పెళ్లాడతా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో చెప్పనక్కర్లేదు. తర్వాత ఆవిడా మా ఆవిడేలో జంటగా యాక్ట్ చేయడంతో పాటు సిసింద్రీలో స్పెషల్ సాంగ్ చేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కింగ్ 100 దసరాకు రిలీజ్ టార్గెట్ పెట్టుకోవచ్చని టాక్.

This post was last modified on May 23, 2026 12:53 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

4 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

8 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

10 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

10 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

13 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

13 hours ago