Movie News

ఆదర్శ కుటుంబంలో మరో అందం

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయికల్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో మెయిన్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ని వేసవి అయిపోయే లోగా గుమ్మడికాయ కొట్టాలనే సంకల్పంతో పరుగులు పెట్టిస్తున్నారు. అక్టోబర్ విడుదలని టార్గెట్ చేసుకున్నారు కానీ ఇప్పుడప్పుడే అనౌన్స్ చేసే ఉద్దేశంలో లేరు. కొద్దిగా టైం పడుతుంది.

ఇదిలా ఉండగా ఆదర్శ కుటుంబంలో మరో అందం వచ్చి చేరింది. నివేత పేతురాజ్ కు ఒక ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చినట్టు తెలిసింది. ఇంతకు ముందు అల వైకుంఠపురములో కూడా నివేత నటించింది. బన్నీ మరదలిగా వేసింది చిన్న వేషమే అయినా కొంచెం స్పేస్ దొరికింది. ఈ మధ్య స్క్రీన్ మీద ఎక్కువ కనిపించని నివేతకు ఇది మంచి బ్రేక్ అవుతుందని చెప్పొచ్చు. క్యారెక్టర్ వివరాలు పూర్తిగా తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరని టాక్.

ఇదిలా ఉండగా దర్శకుడిగా కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ కేవలం సింగల్ హీరోయిన్ కి పరిమితమయ్యేవారు. నువ్వే నువ్వే, అతడు, ఖలేజా మొదలైన వాటిలో రెండో కథానాయిక ఉండదు. కానీ తర్వాత స్టయిల్ మార్చారు. అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, గుంటూరు కారం ఇలా దేన్ని తీసుకున్నా సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆఆలో అనుపమ పరమేశ్వరన్ కు దక్కినంత స్కోప్ మిగిలినవాళ్లకు అంతగా కుదరలేదు.

వెంకీకి రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు వాసు లాంటి మ్యూజికల్ మూవీకి మంచి మాటలు రాశారు. అప్పటి నుంచే మాటల మాంత్రికుడి డైరెక్షన్లో వెంకటేష్ నటించాలని ఫ్యాన్స్ కోరుతూ వచ్చారు. దశాబ్దాల తర్వాత వాళ్ళ కోరిక నెరవేరుతోంది. సంగీత దర్శకుడిగా మొదట తీసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తమన్ వచ్చిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ మంచి ఊపుమీదున్నాయి.

This post was last modified on May 22, 2026 2:43 pm

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

1 hour ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

1 hour ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

2 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

3 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

4 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

4 hours ago