బాలీవుడ్ నటులు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమి కాదు. దశాబ్దాల నుంచి ఉన్నదే. కాకపోతే వాళ్ళు ప్రమోషన్లలో అంతగా కనిపించరు. అదేదో మీరే చేసుకోండి అన్న రీతిలో ఉండిపోతారు. ఆదిపురుష్ లో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ కనీసం మీడియా కెమెరా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ పెద్ది విషయంలో అలా లేదు. ఇందులో ఎంపైర్ తరహా పాత్ర పోషించిన బోమన్ ఇరానీ ముంబై మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో బోలెడు విశేషాలు పంచుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ సుల్తాన్, అమీర్ దంగల్ లాంటి వాటితో పెద్దికి పోలికలు రావడం సహజమని, కానీ మీరు ట్రైలర్ లో చూసింది ఏమి కాదని, అసలు సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని, మిమ్మల్ని వెంటాడుతుందని, చాలా అరుదుగా ఇలాంటి చిత్రాలు వస్తాయని ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చారు. ఆయనతో పాటు కూర్చుంటున్న దివ్యెందు శర్మ సైతం అందరూ తనను విలన్ అనుకుంటున్నారని, కానీ స్క్రీన్ మీద క్యారెక్టర్ ఎడ్జ్ చూశాక ఆశ్చర్యానికి గురవుతారని హామీ ఇస్తున్నాడు.
అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ తాతయ్యగా నటించిన తర్వాత బోమన్ ఇరానీ చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు చేశారు కానీ దాన్ని మించిపోయే విజయం అయితే దక్కలేదు. ఇప్పుడు ఆయన ఇంత బల్లగుద్ది చెప్పడం చూస్తే పెద్ది కంటెంట్ మీద అంచనాలు ఏ మాత్రం తగ్గించుకొనవసరం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి తగ్గట్టే నార్త్ హక్కులు కొన్న జియో స్టూడియోస్ పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓ రేంజులో పబ్లిసిటీ జరుగుతోంది.
ఇవాళ్టి నుంచి లెక్కేసుకుంటే పెద్ది రిలీజ్ కు పదమూడు రోజులు సమయం ఉంది. ఎల్లుండి భోపాల్ లో జరిగే ఏఆర్ రెహమాన్ ఈవెంట్ తో హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతుందనే ధీమా బుచ్చిబాబు బృందంలో కనిపిస్తోంది. ట్రైలర్ మీద మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ దాని ప్రభావం గ్రౌండ్ లెవెల్ లో లేదని, విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ లెక్కలు మారిపోతాయని, మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఖాయమని చెబుతున్నారు. దానికి తగ్గట్టే థియేటర్లను సిద్ధం చేసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates