హారికను దూరం పెట్టేసిన అభిజీత్‍

బిగ్‍బాస్‍ హౌస్‍లో వున్నంత కాలం అభిజీత్‍ వెంట హారిక తిరగడం, ఆమె మాట్లాడకపోతే తనతో టైమ్‍ స్పెండ్‍ చేయమంటూ అభిజీత్‍ టిష్యూలపై లేఖలు రాయడం పలు అనుమానాలకు తావిచ్చింది. మోనల్‍, అఖిల్‍ మాదిరిగా కాకపోయినా ఒక సైలెంట్‍ ట్రాక్‍ అయితే ఈ ఇద్దరి మధ్య నడిచింది. దానికి ఆజ్యం పోస్తూ ఇద్దరి తల్లులూ పలుమార్లు ఇరువురి ప్రస్తావన తీసుకొచ్చి ‘అభిక’ ట్యాగ్‍ ట్రెండ్‍ అవడంలో తమవంతు పాత్ర పోషించారు. అయితే బిగ్‍బాస్‍ టైటిల్‍ గెలిచిన దగ్గర్నుంచీ హారికకు అభిజీత్‍ దూరంగా వుంటున్నాడు. అవినాష్‍-అరియానా, సోహైల్‍-మెహబూబ్‍-అఖిల్‍… ఇలా మిగతా వారంతా తమ రిలేషన్‍షిప్‍ బయట కూడా కొనసాగిస్తోంటే అభిజీత్‍ బయటకు అడుగు పెట్టడమే హారికను చెల్లెలనేసాడు.

లోపల వున్నన్ని రోజులు అతడు ఆమెను చెల్లి అనడం ఎప్పుడూ చూపించలేదు. ఇంటర్వ్యూలలో తన గురించి అడుగుతారని గ్రహించి మొదటి ఇంటర్వ్యూలోనే చెల్లి అనేసి ఇక ఆ టాపిక్‍కు అభి చెక్‍ పెట్టేసాడు. అంతేకాదు బయటకు వచ్చాక అసలు హారికతో పని లేకుండా తన పీఆర్‍ ట్రిక్కులు ప్లే చేస్తూ ముందుకెళుతున్నాడు. టాప్‍ 5లోని మిగతా ముగ్గురూ మైలేజ్‍ తెచ్చుకుంటున్నారు కానీ పాపం హారికే బిగ్‍బాస్‍ నుంచి బయటకు వచ్చాక అంతగా కనిపించడం లేదు. అభిజీత్‍ సిస్టర్‍ అనడం పట్ల తన స్పందన ఏమిటో తెలుసుకోవాలని యూట్యూబ్‍ చానల్స్ వాళ్లు వెయ్యి కెమెరాలతో ఎదురు చూస్తున్నారు.