సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఫస్ట్ కాపీ హక్కులను నిర్మాతకు అయిన ఖర్చుపైన అయిదు కోట్లు లాభమిచ్చి జీ స్టూడియో సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. లాక్‍డౌన్ టైమ్‍లో ఓటిటి ప్లాట్‍ఫామ్ ప్రయోజనాల కోసం చేసిన రిస్కే అయినా కానీ ఇప్పుడీ సినిమా జీ నెట్‍వర్క్ కి ప్రయోగశాలగా మారిపోయింది. ముందుగా ఆ చిత్ర థియేట్రికల్ రైట్స్ను అమ్మేసారు.
మామూలుగా సాయి తేజ్ సినిమాకుండే మార్కెట్‍పై సగం రేటుకే రైట్స్ ఇచ్చారు. ఎన్నో నెలల తర్వాత వచ్చిన సినిమా కావడంతో మొదటి వారాంతంలో థియేటర్లకు జనం బాగానే వచ్చారు. వీక్ డేస్‍లో వసూళ్లు వీక్ అయినా మళ్లీ జనవరి 1 వీకెండ్‍కి పుంజుకుంటుందని చూస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారం నుంచీ జీ ప్లెక్స్లో ప్రదర్శనకు పెట్టాలని జీ స్టూడియో రంగం సిద్ధం చేస్తోంది.
అంటే సినిమా చూడాలనుకునే వాళ్లు ఫలానా అమౌంట్ కట్టి ఇంట్లోనే చూసుకోవచ్చు. అలా ఆ నెలలో ఎంత వస్తుందో అంత వెనకేసుకుంటారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో సినిమాను జీ5లో స్ట్రీమింగ్‍కు పెట్టేస్తారు. సీటీమార్, అంటే సుందరానికీ చిత్రాల హక్కులను కూడా జీ సంస్థ ఇలాగే దక్కించుకుంది. ఇంకా పలు భారీ చిత్రాలపై కూడా కన్నేసినట్టు తెలిసింది.
This post was last modified on December 30, 2020 9:11 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…