రాజమౌళి సినిమా తర్వాత రీజనల్ సినిమా ప్లాన్ చేస్తే ఆ హీరోకి ముందు చూపు లేనట్టే అనుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్. రిజల్ట్ ఎలా వుంటుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కానీ దాని తర్వాత ఎన్టీఆర్, చరణ్ చేసే సినిమాలయితే కచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్‍ను టార్గెట్ చేసి తీరతాయి.
త్రివిక్రమ్‍తో ఆల్రెడీ తన తదుపరి చిత్రాన్ని తారక్ ఎప్పుడో ఓకే చేసేసి పెట్టుకున్నాడు. కానీ చరణ్ మాత్రం ఇంతవరకు తదుపరి చిత్రమేంటనే దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే చప్పుడు లేకుండా చరణ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టేసుకున్నాడు. అది మరేదో కాదు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎప్పుడో చరణ్‍కి ఒక లైన్ వినిపించాడు. అతనిప్పుడు జెర్సీ చిత్రాన్ని షాహిద్ కపూర్‍తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
ఆ సినిమా విడుదలయితే గౌతమ్‍కి బాలీవుడ్‍లో కూడా మంచి గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే అతడితో చరణ్ సినిమా అంటే హిందీ మార్కెట్ పరంగా ఢోకా వుండదు. ఈ ప్రాజెక్ట్ ఎలాగో ఓకే అయింది కనుకే చరణ్ మిగతా సినిమాల పట్ల ఎక్కువ టెన్షన్ పడడం లేదు. తారక్‍తో సినిమా తర్వాత తనతో సినిమా చేయాలని త్రివిక్రమ్‍ని ఆల్రెడీ చరణ్ లాక్ చేసి పెట్టుకున్నాడు.
This post was last modified on December 30, 2020 9:07 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…