ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న ఎగ్జిబిటర్లు ఇలా ఎవరికి వారు తమ తమ వెర్షన్లతో రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు. నాగవంశీ, సునిల్ నారంగ్, రవిశంకర్, సాహూ గారపాటితో పాటు ఇప్పటిదాకా కెమెరాకు అంతగా పరిచయం లేని థియేటర్ ఓనర్లు ఇప్పుడు తమ స్టేట్ మెంట్ల ద్వారా సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. ఇది చాలా తీవ్ర స్థాయికి చేరుకున్న మాట వాస్తవం.
అందరూ కలిసి దీని మీద ఛాంబర్ మీటింగ్ చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రతినిధులు పాల్గొంటారు. పదిహేను ఈ మీటింగ్ జరగనుంది. అయితే పరిష్కారం దొరుకుతుందా అంటే అంత ఈజీ అయితే కాదు. ఇంకో దఫా చర్చలు అవసరం పడొచ్చు. రెండు వర్గాలు ఖచ్చితంగా రాజీ పడాలి. లేదంటే ఇంకా పెద్ద రచ్చ అవుతుంది. ఇప్పటికే పరువు వీధికెక్కిందని పలువురు సీనియర్లు బాధ పడుతున్నారు. సమస్యల నుంచి వ్యక్తిగత దూషణలకు వెళ్లడం మంచిది కాదంటున్నారు.
పెద్ది విడుదలకు ఇంకో పదిహేడు రోజులు మాత్రమే ఉంది. ప్రమోషన్లు క్రమంగా ఊపందుకోబోతున్నాయి. థియేటర్ అగ్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సింగల్ స్క్రీన్లు కావాలంటే తెలంగాణ ప్రదర్శకులు ఒక మెట్టు దిగాలి. లేదా నిర్మాతలు పర్సెంటెజ్ కి ఒప్పుకోవాలి. లేదంటే సమస్య ఇంకా తీవ్రం అవుతుంది. ఒక్క హైదరాబాద్ లోనే పాతిక దాకా సింగల్ స్క్రీన్లలో పెద్ది వేయకపోతే వచ్చే నష్టం ఫుల్ రన్ లో ఏడెనిమిది కోట్లకు పైనే ఉంటుంది.
ఇదంతా మెగా ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. తమ హీరోల సినిమాలు వచ్చినప్పుడే ఇలా చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎవరూ టార్గెట్ కాదని ఎగ్జిబిటర్లు చెబుతున్నప్పటికీ సొల్యూషన్ దొరికే వరకు ఇది ఇలాగే నానుతూ ఉంటుంది. కొత్త సినిమాల హడావిడి ఏం లేకపోవడంతో ఈ ప్రెస్ మీట్ల తాలూకు వీడియోలతోనే సోషల్ మీడియా హ్యాండిల్స్ టైం పాస్ చేస్తున్నాయి. ఇంకెంత దూరం వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
This post was last modified on May 15, 2026 8:53 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…