మళ్ళీ అలా.. ఛాన్స్ వస్తే..

అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్‌లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్‌ని రివర్స్‌లో తిప్పేశాయి. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఇలా ఐదు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో 2023 నుంచి తెలుగులో స్ట్రెయిట్ సినిమా లేదు, బాలీవుడ్ కూడా పలకరించడం మానేసింది.

ఇలాంటి టైమ్‌లోనే లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కాంబో AA23 కోసం పూజా పేరు వినిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ‘పుష్ప’తో గ్లోబల్ స్టార్ అయిన బన్నీ నెక్స్ట్ లైనప్, దానికి తోడు LCU బ్రాండ్ ఉన్న లోకేష్ డైరెక్షన్. మైత్రీ మూవీ మేకర్స్ 500 కోట్ల బడ్జెట్, అనిరుధ్ మ్యూజిక్ అంటే లెక్కే వేరు. ఈ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ వస్తే అది పూజాకి సెకండ్ ఇన్నింగ్స్‌కి ఫుల్‌టాస్ లాంటిది. కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది. మార్కెట్ డౌన్‌లో ఉన్న హీరోయిన్‌ని ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో తీసుకునే రిస్క్ మేకర్స్ చేస్తారా అనేది అసలు డౌట్.

గత ఏడాదిన్నరలో పూజా చేజార్చుకున్న ప్రాజెక్టుల లిస్ట్ చూస్తే డౌట్ ఇంకా పెరుగుతుంది. ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకోవడం, పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు లేవు. ప్రస్తుతం ఆమె చేతిలో జననాయగన్ ఉంది. అది కూడా ఎప్పుడొస్తుందో తెలీదు. ఇక బన్నీ లాంటి స్టార్ పక్కన, అదీ లోకేష్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ అంటే చిన్న విషయం కాదు.

నిజంగా ఛాన్స్ వస్తే ఆమె లక్కు మారొచ్చు. లోకేష్ సినిమాల్లో హీరోయిన్ రోల్ తక్కువైనా గుర్తుండిపోతుంది. ‘విక్రమ్’లో గాయత్రి, ‘లియో’లో త్రిష పాత్రలు చిన్నవే అయినా ఇంపాక్ట్ ఉన్నవే. పైగా బన్నీ పూజా కాంబోకి ‘బుట్టబొమ్మ’తో యూత్‌లో ఇప్పటికీ క్రేజ్ ఉంది. పాన్ ఇండియా రిలీజ్‌కి నార్త్ ఆడియన్స్‌కి తెలిసిన ఫేస్ అవసరం. ఈ యాంగిల్స్ పూజాకి ప్లస్ అవుతాయి. అందుకే ఫ్లాపుల్లో ఉన్నా సరే, ఈ కాంబినేషన్ సెట్ అయితే ట్రేడ్‌కి కూడా కలిసొస్తుంది.