Movie News

మూర్తిగారు చెప్పినవి అక్షరాలా నిజాలు

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించిన డైరెక్టర్స్ డేలో ఆయన అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఒక్క పెద్ద సినిమా లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ కృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణరావుగారిలా వేగంగా సినిమాలు చేసే ట్రెండ్ మళ్లీ రావాలని, వాళ్ళు ఏడాదికి అయిదు పది సినిమాలు తీసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

నారాయణమూర్తి గారు అన్నది అక్షరాలా పాటించాల్సిన నిజాలు. గత కొన్నేళ్లుగా హీరోలే కాదు ప్యాన్ ఇండియా పేరుతో దర్శకులు కూడా ఒక్క సినిమాకు రెండు మూడు సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. రాజమౌళి అంటే ఆయన గ్రాండియర్స్ వేరే స్థాయిలో ఉంటాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. మీడియం బడ్జెట్ తో తీసే ఫ్లాప్ డైరెక్టర్లు కూడా ఆఫర్లు ఉన్నా సరే కాలయాపన చేస్తున్న వైనం ఒకరిద్దరి విషయంలో కాదు చాలామందిలో ఓపెన్ గా కనిపిస్తోంది.

పరిశ్రమ పచ్చగా ఉండాలంటే వరసగా సినిమాలు రావాలి. అప్పట్లో దాసరిగారు రోజుకు మూడు నాలుగు షిఫ్టులు అవసరమైనా పని చేసేవాళ్ళు. ఏకకాలంలో మూడు షూటింగులు చేసేవాళ్ళు. అన్ని బాధ్యతలు మోసుకునేవాళ్లు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఒకసారి పద్నాలుగు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఇప్పడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు తదితరులంతా ఏడాదికి ఒక్కటి ఇవ్వడమే అసాధ్యమనేలా మారిపోయారు.

అలాని క్వాలిటీ లేకుండా కంటెంట్స్ ఇవ్వమని కాదు. అలా చేస్తే ఏమవుతుందో గత కొన్నేళ్లలో బాక్సాఫీస్ సాక్షిగా ఎన్నో డిజాస్టర్లు థియేటర్లను ముంచేశాయి. సో నాణ్యతని మిస్ కాకుండానే బెస్ట్ ఇవ్వడానికి అందరూ కష్టపడాలి. కనీసం ఏడాదికి ఒక్కో స్టార్ హీరో ఒక సినిమా ఇచ్చినా చాలు పన్నెండు నెలల థియేటర్ ఫీడింగ్ కి ఢోకా ఉండదు. అలా కాకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తూ ఉంటే ఇప్పటికే తగ్గిపోయిన సింగల్ స్క్రీన్ల మనుగడ మరింత కష్టమవుతుంది.

This post was last modified on May 5, 2026 11:40 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

31 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago