ప్రగ్యా జైశ్వాల్.. సోషల్ మీడియాలో ఈ హాట్ భామను ఫాలో అయ్యేవాళ్లు ఆమెకు సినిమాల్లో పెద్దగా ఛాన్సులెందుకు రావట్లేదా అని ఆశ్చర్యపోకుండా ఉండరు. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఎవరికీ తీసిపోని అందచందాలు ఆమె సొంతం. గ్లామర్ షోకు ఆమె ఎప్పుడూ వెనుకాడదు. ట్రెండీ ఔట్ ఫిట్‌లతో ఆమె చేసే ఫొటో షూట్లు చూస్తే కుర్రాళ్ల గుండెలు లయ తప్పకుండా ఉండవు. ‘కంచె’ సినిమాలో మరీ పద్ధతిగా కనిపించేసరికి ఫిలిం మేకర్లు తనను అపార్థం చేసుకున్నారేమో అని.. ఈ ఫొటో షూట్లలో ఎప్పుడూ అందాలు ఆరబోస్తూనే ఉంటుంది ప్రగ్యా. అదిరిపోయే ఫిజిక్.. షార్ప్ లుక్స్‌తో ప్రగ్యా ప్రతి ఫొటో షూట్‌తోనూ వావ్ అనిపిస్తూనే ఉంటుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని తరహాలోనే ఇన్నర్ వేర్ బ్రాండ్లకు ప్రమోట్ చేస్తూ ఆమె చేసే ఫొటో షూట్లు కూడా బాగా హైలైట్ అవుతుంటాయి. తాజాగా ఆమె డీజిల్ ఇన్నర్ వేర్ బ్రాండును ప్రమోట్ చేస్తూ చేసిన షూట్ తాలూకు ఫొటోల్లో హాట్‌నెస్ మామూలుగా లేదు. మరీ ఎక్స్‌పోజింగ్ చేసినట్లేమీ లేదు కానీ.. కుర్రాళ్లకు కావాల్సిన కిక్కయితే ఫుల్లుగా ఇచ్చేసింది ప్రగ్యా. గత రెండేళ్లలో పెద్దగా సినిమాలు చేయకున్నా కేవలం సోషల్ మీడియాలో తన ఫొటోల రచ్చతోనే వార్తల్లో నిలుస్తూ వస్తున్న ప్రగ్యాకు చాన్నాళ్ల తర్వాత ఓ చిత్రంలో అవకాశం అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల రూపొందించనున్న ‘డి అండ్ డి’లో ప్రగ్యా ఓ కథానాయికగా నటించనుందట. విష్ణుతో ఇంతకుముందు ‘ఆచారి అమెరికా యాత్ర’ లాంటి ఫ్లాప్ మూవీలో నటించిన ప్రగ్యాకు కొత్త సినిమా అయినా ఆశించిన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on January 5, 2021 2:09 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…